రీ రిలీజ్ కు సూర్య సూపర్ హిట్ మూవీ..

By Mahesh Jujjuri  |  First Published Feb 8, 2024, 10:26 AM IST

ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. వరుసగా స్టార్ హీరోల పాత సినిమాలకు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా రిలీజ్ అవ్వగా.. తాజాగా సూర్య సూపర్ హిట్ సినిమాను రీరిలీజ్ చేయడం కోసం రెడీ అవుతున్నారు. 


ప్రస్తుతం  రీరిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు హిట్అయినా కాకపోయినా.. అప్పట్లో ట్రెండ్ క్రిమేట్ చేసిన మూవీస్ ను రీరిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు.అంతే కాదు.. అంతే కాదు.. రీరిలీజ్ వల్ల మంచి కలెక్షన్లు కూడా సాధిస్తూ.. మరోసారి ఖాతాలో డబ్బులేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇలా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీరిలీజ్ అయ్యింది. ఇక తాజాగా మరో సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. 

తెలుగు మార్కెట్ లో తమిళ హీరోలకు కూడా మంచి ఇమేజ్ ఉంది. కొంత మంది తమిళస్టార్స్ కు సబంధించిన సినిమాలు కూడా టాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తుంటాయి. ఇక రీరిలీజ్ ట్రెండ్ లో కూడా తమిళ హీరోల సినిమాలు చేరిపోయాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన తమిళ డబ్బింగ్ మూవీస్ రీరిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా.. సూర్య  హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. 

Latest Videos

ఆ పాత్ర చేయాలంటే భయపడుతున్న జూనియర్ ఎన్టీఆర్, తారక్ డ్రీమ్ రోల్ అదేనట.

కోలీవుడ్  స్టార్ హీరో సూర్య కెరీర్‏లోనే  ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సూర్య s/o కృష్ణన్.  రీరిలీజ్ కాబతోంది. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమీరా రెడ్డి, దివ్య స్పందన, సిమ్రాన్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో సూర్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. 2008లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈసినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది.

లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఈ సినిమా తమిళ్ వర్షన్ అక్కడ రీరిలీజ్ చేశారు. అప్పుడు అక్కడ ఈమూవీ  మంచి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో సూర్య అభిమానులు భారీగా హడావిడి చేశారు. రిలీజ్ సినిమాకంటే కూడా పెద్దగా హంగామా చేశారు. రీరిలీజ్ పై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక మళ్లీ ఇన్ని రోజులకు అది కూడా తెలుగులో ఈసినిమా రీరిలీజ్ కు ప్లాన్ చేశారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాలెంటైన్స్ డే రోజున అంటే ఫిబ్రవరి 14న మళ్లీ తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సందీప్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్న కంగనా రనౌత్.. వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.
 

click me!