
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి వరుసగా సినిమా తారలు తిరిగిరాని లోకాలకువెళ్ళిపోతున్నారు. ఈ ఏడాది కూడా అది కంటీన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా విశ్వనాథ్, వాణీ జయరామ్, తారకరత్న మరణవార్తలను జీర్ణిచుకోలేక పోయింది సినీ పరిశ్రమ. అన్ని భాషల్లో ఈ విషాదాలు తప్పడంలేదు. టాలీవుడ్ లోవరుస మరణాలు మరువకముందే తమిళ ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ కోలీవుడ్ హస్యనటుడు మయిల్‌స్వామి కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున మయిల్ స్వామి అస్వస్తతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు సమీపంలోని పోరూర్‌లోని ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. కాగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్‌లు వెల్లడించారు. మయిల్ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యింది. కోలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్లు పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మయిల్ స్వామి 1984లో సినీరంగ ప్రవేశం చేశారు. ధవని కనవుగల్ అనే తమిళ సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. తన మార్క్ కామెడీతో ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు. దాంతో ప్రేక్షకుల ఆదరణతో వరుస అవకాశాలు మయిల్ స్వామిని వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు మయిల్‌స్వామి .. వరుస సినిమాత స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడేు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు తమిళ కమెడియన్.
దాదాపు 40 ఏళ్లు.. 200 సినిమాలతో .. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు మయిల్ స్వామి.లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ది లెజెండ్ సినిమాలోనూ మయిల్‌స్వామి మంచి పాత్ర పోషించాడు. ఇక కమెడియన్ గా అవకాశాలు తగ్గినా.. తక్కువలో తక్కువ ఏడాదికి అయిదారు సినిమాలైనా చేస్తూ వస్తున్నాడు మైయిల్ స్వామి. ఇక స్టార్ కమెడియన్ మరణంతో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు కమల్ హాసన్, రజనీ కాంత్ లాంటిస్టార్స్ సంతాపం ప్రకటించారు. కోలీవుడ్ ప్రముఖ నటులు కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.