
తమిళంతో పాటుగా.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళనాట స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న ఈ హీరోకు.. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తాజాగా తెలుగులో కూడా డైరెక్ట్ సినిమా చేసి తన మార్క్ చూపించుకున్నాడువిజయ్. ఇక విజయ్ సినిమాలు తెలుగు, తమిళంతో పాటు సౌత్ భాషల్లో బాగా ఆడతాయి. ఆయనకు ఆయా భాషల్లో కూడా ఫాలోయింగ్ గట్టిగానే ఉంది .
ఇక విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లియో టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈసినిమాతో పాటు.. విజయ్ తన 68 సినిమాను కూడా లైన్ లో పెట్టడాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈసినిమాకు విజయ్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈసినిమా కోసం విజయ్ దళపతి ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో ఈ వార్త వైరల్ అవుతోంది. అంతే కాదు సినిమా లాభాల్లో శేర్ కూడా తీసుకోబోతున్నాడట విజయ్. కాని ఆ శేర్ తో కలుపుకుని 150 కోట్లు తీసుకుంటున్నాడా..? లేక రెమ్యునరేషన్ వేరు.. శేర్ వేరునా అనేది మాత్రం తెలియడం లేదు. ఏది నిజం అయినా.. విజయ్ మాత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డ్ సాధించినట్టే..
ఇక వంద కోట్ల హీరోల లిస్ట్ లో విజయ్ కూడాచేరబోతున్నాడు. ఇప్పటి వరకూ సౌత్ నుంచే ఎక్కువగా 100 కోట్లు రెమ్యూనరేషన్ హీరోలు ఉన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు.. బలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా వందకోట్లకు పైనేరెమ్యూనరేన్ తీసుకుంటారు. ఇక ఆ లిస్ట్ లో విజయ్ తో పాటు .. త్వరలోనే మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే నిజమైతే సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్‌గా విజయ్ రికార్డుల్లోకెక్కడం పక్కా అయినట్టే.
ఇండియాతోపాటు విదేశాల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సినిమా అంటే దాదాపు శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో రెమ్యునరేషన్ కవర్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్‌తో పోలిస్తే 150 కోట్లు ఎక్కువేమి కాదంటున్నారు ట్రేడ్ పండితులు.