షూటింగ్లో సల్మాన్ ఖాన్ కి ప్రమాదం!

Published : May 19, 2023, 01:02 PM IST
షూటింగ్లో సల్మాన్ ఖాన్ కి ప్రమాదం!

సారాంశం

హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు.   


సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టైగర్ 3. ఈ చిత్ర షూటింగ్లో సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడట. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఎడమ భుజానికి గాయమైంది. దాంతో వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స అందించారు. తన భుజానికైన గాయాన్ని చూపుతూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. సల్మాన్ ప్రమాదం బారినపడ్డారని తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 

ఏక్తా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు సీక్వెల్ గా టైగర్ 3 తెరకెక్కుతుంది. సల్మాన్ ఖాన్ కి జంటగా కత్రినా కైఫ్ నటిస్తుంది. షారుక్ క్యామియో రోల్ చేస్తున్నారు. మనీష్ శర్మ ఈ చిత్ర దర్శకుడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. 

ఇక సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. తమిళ చిత్రం వీరం కి రీమేక్ గా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా నిరాశపరిచింది. పూజా హెగ్డే ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక రోల్ చేయడం విశేషం. టైగర్ 3 చిత్రంతో కమ్ బ్యాక్ కావాలని సల్మాన్ చూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే