అవును బ్యాగ్ ఖాళీగా ఉంది ఏం చేయమంటావ్.. నెటిజన్ కు ఆలియా భట్ కౌంటర్..

Published : May 19, 2023, 01:00 PM IST
అవును బ్యాగ్ ఖాళీగా ఉంది ఏం చేయమంటావ్.. నెటిజన్ కు ఆలియా భట్ కౌంటర్..

సారాంశం

రీసెంట్ గా ట్రోలర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. బాలీవుడ్ బ్యూటీ.. ఆలియా భట్. తన ఫోటోపై కామెంట్ చేసిన వ్యక్తికి.. తన మాత్క్ కామెంట్ తో దిమ్మతిరిగేలా చేసింది. ఇంతకీ ఏమయ్యిందంటే..?

వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేక ఇమేస్ సాధించింది ఆలియా భట్. కెరీర్ మంచి జోరు మీద ఉన్నప్పుడే.. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్ళాడి.. వెంటనే ఓబిడ్డకు తల్లి కూడా అయ్యింది ఆలియా భట్. బిడ్డకోసం రెండేళ్లు సినిమాలకు విరామం ప్రకటించింది బ్యూటీ. అయితే ఇంతలోనే ఆమెకు ఇంటన్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా అవకాశం గుమ్మం ముందుకు వచ్చింది. దాంతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుంది ఆర్ఆర్ఆర్ హీరోయిన్. 

రీసెంట్ గా గాలా ఫెస్టివల్ లో లక్ష్యముత్యాలతో చేసిన స్వేత వర్ణపు గౌన్ లో మెరిసింది బ్యూటీ. అంతట తానే ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది బ్యూటీ. ఇక దాని తరువాత తాజాగా అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థ గూచి ఇండియా నుంచి ఫస్ట్ టైమ్ తమ ప్రాడెక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆలియా భట్ ను సెలక్ట్ చేసుకోండంతో పాటు.. అఫిషియల్ గా ప్రకటించింది కూడా. ఈ విషయాన్ని గూచితో పాటు.. ఆలియా భట్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. 

లగ్జరీ బ్రాండ్‌కు తొలి భారతీయ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి.. హెడ్‌లైన్స్‌ లో నిలిచిన ఆలియా భట్..  బ్రాండ్‌ ప్రమోషన్‌ లో భాగంగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఫ్యాషన్‌ ఈవెంట్‌ Gucci Cruise 2024కు హాజరైంది.  అలియాభట్‌ స్టన్నింగ్ బ్లాక్ మినీ డ్రెస్‌లో హై హీల్స్‌లో అందరిలో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  అంతే కాదు సూపర్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేసిన అలియా భట్‌ను  నెటిజన్లు కూడా పొడుగుతూ కామెంట్లు పెట్టగా.. ఓ విషయంలో మాత్రం ట్రోల్స్‌ చుట్టుముడుతున్నాయి.

 

అలియాభట్‌ మంచి డ్రస్ వేసుకోవడంతో పాటు..  చేతిలో ఓ ట్రాన్స్‌పరెంట్‌ బ్యాగ్‌ కూడా వేసుకున్నారు. ఆ బ్యాక్ ఈ ట్రోల్స్‌ కు కారణమైంది. అలియా ఖాళీ బ్యాగ్‌ను ఎందుకు పట్టుకొచ్చింది..అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా.. ఆ పర్సు కనీసం కొన్ని వస్తువులైనా పెట్టుకునేలా ఉండాలి.. కానీ ఖాళీగా ఉంది అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు.  అయితే అలియా భట్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోనట్టే ఉండి.. సడెన్ గా ఓ కౌంటర్ విసిరింది. అవును.. నా బ్యాగు ఖాళీగానే ఉంది. ఏం  చేయమంటారు అంటూ సింపుల్ గా కామెంట్ పెట్టి వదిలేసింది. ఇక అభిమానులు మాత్రం అలియాభట్‌పై లవ్‌ ఎమోజీలతో ప్రశంసలు కురిపిస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?