కిర్రాక్‌ డాన్సులతో మతిపోగొడుతున్న తమన్నా.. చూపుతిప్పుకోనివ్వడం లేదుగా!

Published : Jul 09, 2021, 05:36 PM IST
కిర్రాక్‌ డాన్సులతో మతిపోగొడుతున్న తమన్నా.. చూపుతిప్పుకోనివ్వడం లేదుగా!

సారాంశం

తన డాన్స్ స్కిల్స్ ని పీక్‌లో చూపించింది తమన్నా. ఓ పాప్‌ సాంగ్‌కి అదిరిపోయే డాన్స్ లు చేసి వాహ్‌ అనిపించింది. అంతేకాదు ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

మిల్కీ బ్యూటీ అందమైన నటి మాత్రమే కాదు, అద్భుతమైన డాన్సర్‌ కూడాను. సినిమాల్లో ఆమె డాన్సులు ఉర్రూతలూగిస్తాయి. ఆడియెన్స్ చేత థియేటర్‌లో స్టెప్పులేయిస్తాయి. తాజాగా తన డాన్స్ స్కిల్స్ ని పీక్‌లో చూపించింది తమన్నా. ఓ పాప్‌ సాంగ్‌కి అదిరిపోయే డాన్స్ లు చేసి వాహ్‌ అనిపించింది. అంతేకాదు ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. 

 డోజా కాట్, ఓ బాయ్ కలసి పాడిన `కిస్ మీ మోర్` అనే పాటకు కొరియోగ్రాఫర్ షజియా సమ్జీతో కలసి ఎనర్జిటిక్‌ స్టెప్పులతో ఫిదా చేసింది. ఈ అమ్మడి లెగ్‌ షేక్‌కి సోషల్‌ మీడియా మొత్తం షేక్‌ అయిపోతుండటం విశేషం. తమన్నా చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా ఏమాత్రం తరగని అందం తమన్నా సొంతం. అదే అందం, అదే ఫిజిక్‌తో మతిపోగొడుతుంది. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడిందీ మిల్కీ బ్యూటీ. 

ఇప్పుడు ట్రెండ్‌ మార్చింది. సినిమాలతోపాటు టీవీ షోస్‌, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుంది. ఇప్పటికే రెండు వెబ్‌సిరీస్‌లతో అదరగొట్టింది. మరోవైపు `మాస్టర్‌చెఫ్‌ తెలుగు` అనే వంటల ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేస్తుంది. దీంతోపాటు స్పెషల్‌  సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న తమన్నా  ప్రస్తుతం `సీటీమార్‌`, `ఎఫ్‌3`, `గుర్తుందా.. శీతాకాలం`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?