తన మూడో బిడ్డని పరిచయం చేసిన కరీనా కపూర్‌..

Published : Jul 09, 2021, 03:22 PM IST
తన మూడో బిడ్డని పరిచయం చేసిన కరీనా కపూర్‌..

సారాంశం

హీరోయిన్‌గా అందం, అభినయంతో మంత్రమగ్గుల్ని చేయడంతోపాటు తనలో మరో కోణాన్ని చాటుకుంది కరీనా. మంచి రైటర్‌ అని కూడా నిరూపించుకుంది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ తన మూడో బిడ్డని పరిచయం చేసింది. ఇటీవల ఆమె రెండో బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే మూడో బిడ్డేంటి? అనుకుంటున్నారా? అది రియల్‌ బిడ్డ కాదు. పుస్తకం తనకు మూడో బిడ్డ అంటూ కరీనా పోస్ట్ చేసింది. హీరోయిన్‌గా అందం, అభినయంతో మంత్రమగ్గుల్ని చేయడంతోపాటు తనలో మరో కోణాన్ని చాటుకుంది కరీనా. మంచి రైటర్‌ అని కూడా నిరూపించుకుంది. తాజాగా ఆమె `ప్రెగ్నెన్సీ బైబిల్‌` పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. తాజాగా దాన్ని ఆవిష్కరించింది కరీనా. అంతేకాదు ఈ పుస్తకం తనకు మూడో బిడ్డలాంటిదని తెలిపింది. 

దీనికి సంబంధించిన వీడియోని పంచుకుంది కరీనా. వంటగదిలో అవెన్‌ లోంచి హాట్‌ హాట్‌ కాపీని బయటకు తీయడం విశేషం. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి అనుభవాలు, కష్టనష్టాలను, పలువురి నిపుణులు సలహాలు, సూచనలను ఇందులో పొందుపర్చినట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. తన పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు,  ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా తెలిపింది. 

మాతృత్వం పొందే తల్లులందరికీ ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది కరీనా. తన బిడ్డలకు జన్మనివ్వడం, వారితో గడపడం తనకు చాలా ప్రత్యేకమైన సమయమని, ఆ అనుభవాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. 2020లో  తన మొదటి కుమారుడు తైమూర్‌ నాలుగో పుట్టినరోజు సందర్భంగా  'ప్రెగ్నెన్సీ బైబిల్'  అనే పుస్తకాన్ని  తీసుకొస్తున్నట్టు కరీనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆసక్తికరమైన ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. కాబోయే తల్లులకు సహాయకారిగా ఉండేలా కీలకమైన చిట్కాలను, సమాచారాన్ని ఇందులో రాయబోతున్నట్టు  తెలిపారు. 

కరీనా, సైఫ్‌ అలీ ఖాన్‌ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్‌ అలీ ఖాన్‌ జన్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న కరీనా తన రెండో కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సెకండ్‌ సన్‌ని ఇప్పటికే పరిచయం చేసింది కరీనా. తాజాగా అతన్ని `జెహ్‌` అని పిలుచుకుంటున్నట్టు ఓ వార్త బాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్