`లాల్‌సింగ్‌చద్దా` సెట్‌లో నాగచైతన్య.. ఆమీర్‌, కిరణ్‌ రావులతో అరుదైన పిక్‌ ట్రెండింగ్‌

Published : Jul 09, 2021, 04:09 PM ISTUpdated : Jul 09, 2021, 04:28 PM IST
`లాల్‌సింగ్‌చద్దా` సెట్‌లో నాగచైతన్య.. ఆమీర్‌, కిరణ్‌ రావులతో అరుదైన పిక్‌ ట్రెండింగ్‌

సారాంశం

 నాగచైతన్య కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఆయన ఫస్ట్ బాలీవుడ్‌ సినిమా సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రమే ఆమీర్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ చిత్రంలో కీ రోల్‌ ప్లే చేయడం విశేషం. 

నాగార్జున దారిలోనే తనయుడు నాగచైతన్య అడుగులు వేస్తున్నారు. నాగ్‌.. తెలుగులో స్టార్‌ హీరోగా రాణించే క్రమంలోనే బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌ స్టార్స్ సినిమాలు కీలక పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు కూడా `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఆయన ఫస్ట్ బాలీవుడ్‌ సినిమా సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రమే ఆమీర్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ చిత్రంలో కీ రోల్‌ ప్లే చేయడం విశేషం. బాలా అనే సైనికుడిగా కనిపించబోతున్నారు.

ఆమీర్‌ ప్రస్తుతం హిందీలో `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్‌ హీరోయిన్‌. `ఫారెస్ట్ గంప్‌` అనే హాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌. ప్రస్తుతం కరోనా  సెకండ్‌ వేవ్‌ అనంతరం ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా సెట్‌లో కీ రోల్‌ ప్లే చేస్తున్న నాగచైతన్య పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా సెట్‌లోని ఫోటోని చిత్ర బృందం పంచుకుంది. ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌, దర్శకుడితోపాటు నాగచైతన్య ఉన్నారు. సైనికుడి డ్రెస్‌లో ఆమీర్‌, నాగచైతన్య కనిపిస్తుండటం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సైనికుడి లుక్‌లో చైతూ ఆకట్టుకుంటున్నాడు. 

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. నాగచైతన్య, `లాల్‌ సింగ్ చద్దా` సినిమా ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల ఆమీర్‌, తన భార్య కిరణ్‌ రావులు ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే `లాల్‌ సింగ్‌చద్దా`కి కిరణ్‌ రావు ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తను కూడా సెట్‌లో ఉండటం విశేషం.  మరోవైపు తెలుగు చైతూ నటించిన `లవ్‌స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు చైతూ. ఇందులో రాశీఖన్నా కథానాయిక. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్