
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గానే కాదు, స్పెషల్ సాంగ్‌లకు ఫేమస్సే. ఈ అమ్మడు ఆడిపాడిన సినిమాల్లో ఐటెమ్ సాంగుల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. సినిమా కీలక భూమిక పోషించాయి. సినిమాకే ఊపు తీసుకొచ్చాయి. `అల్లుడు అదుర్స్` చిత్రంలో తొలిసారి స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ఇందులో `లబ్బర్ బొమ్మ` పాటలో తన మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించింది. `స్పీడున్నోడు` చిత్రంలో మరోసారి `బ్యాచ్‌లర్ బాబు` బెల్లంకొండతో లెగ్ షేక్ చేసింది. వీటితోపాటు ఎన్టీఆర్‌తో `జై లవకుశ`లో, నిఖిల్‌తో `జాగ్వర్` చిత్రంలో, యష్‌తో `కేజీఎఫ్‌ఃఛాప్టర్ 1`లో, మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు`లో స్పెషల్ సాంగ్‌లతో ఓ ఊపు ఊపింది తమన్నా.
ఇప్పుడు మరోసారి ఐటెమ్ సాంగ్ చేయబోతుందట. మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఆడిపాడేందుకు సిద్ధమవుతుందని సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గని` చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, అందులో తమన్నాతో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఫుల్ మాసీగా ఈ సాంగ్ ఉంటుందని టాక్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్3`లో నటిస్తున్నారు. ఇందులో వెంకీ సరసన తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్‌తేజ్‌కి జోడీగా మెహరీన్ కనిపిస్తుంది. మరోవైపు తమన్నా ప్రస్తుతం `సీటీమార్`, `మ్యాస్ట్రో`, `గుర్తుందాశీతాకాలం`, హిందీలో `బోల్ చుడియన్` చిత్రాల్లో నటిస్తుంది.