సీనియర్‌ నటి జయంతి కన్నుమూత

By Aithagoni RajuFirst Published Jul 26, 2021, 9:36 AM IST
Highlights

తెలుగు సీనియర్‌ నటి జయంతి(76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

తెలుగు సీనియర్‌ నటి జయంతి(76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ,హిందీ చిత్రాల్లో దాదాపు ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించింది. మదర్‌ రోల్స్, బామ్మ రోల్స్ తో నటిస్తూ ఆకట్టుకుంటున్న ఆమె హఠాన్మరణంతో టాలీవుడ్‌ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు అరు దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్న ఆమె `స్వాతికిరణం`, `రాజా విక్రమార్క`, `కొదమ సింహం`, `దొంగమొగుడు`, `శాంతి నివాసం`, `శ్రీదత్త దర్శనం`, `జస్టిస్‌ చౌదరి`, `కొండవీటి సింహం`, `అల్లూరి సీతారామరాజు`, `శ్రీరామాంజనేయ యుద్ధం`, `శారద`, `దేవదాసు` వంటి అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఎమోషన్‌, సెంటిమెంట్‌, పాజిటివ్‌, నెగటివ్‌రోల్స్ తో మెప్పించారు. ఎన్టీఆర్‌,ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, మోహన్‌బాబు వంటి దాదాపు అందరు టాప్‌ స్టార్‌ సినిమాల్లో నటించి మెప్పించారు. 

జయంతి 1945 జనవరి 6వ తేదీన జన్మించారు. కన్నడ సినిమా జైనుగూడు ద్వారా ఆమె 1963 సినీరంగ ప్రవేశం చేశారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని బనశంకరిలో గల తన స్వగృహంలో ామె తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు.

click me!