రాజ్‌కుంద్రాపై మరిన్ని కేసులు.. సొంత ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం.. బిగుస్తున్న ఉచ్చు

Published : Jul 26, 2021, 07:59 AM ISTUpdated : Jul 26, 2021, 08:00 AM IST
రాజ్‌కుంద్రాపై మరిన్ని కేసులు.. సొంత ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం.. బిగుస్తున్న ఉచ్చు

సారాంశం

రాజ్‌కుంద్రాకి చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులే కుంద్రాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. 

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మ్యాన్‌ రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోర్నోగ్రఫీ కేసులో ఆయన గత వారం అరెస్ట్ విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం చెప్పడం దుమారం సృష్టిస్తుంది. రాజ్‌కుంద్రాకి చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులే కుంద్రాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. 

నీలి చిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూరి స్థాయి సమాచారాన్ని పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తుంది. దీంతో రాజ్‌కుంద్రాకి మరిన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి. త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్‌, ఫారిన్‌ ఎక్స్ ఛేంజ్‌ యాక్ట్ (ఫెమా) కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రాజ్‌కుంద్రాని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 27 వరకు ఆయన పోలీసుల కస్టడీలో ఉంటారు. 

ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య శిల్పా శెట్టిని కూడా విచారించారు. ఆమె దీంట్లో తన ప్రమేయం లేదని, పోర్నోగ్రఫీ చిత్రాలు, ఏరోటిక్‌ చిత్రాలు రెండూ వేరని తెలిపింది. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులో ఆదివారం నాడు టెలివిజన్‌ నటి, మోడల్‌ గెహానా వశిష్ట్‌తో పాటుగా మరో ఇద్దరిని ముంబై పోలీసులు సమన్లు పంపించగా వారు విచారణకు హాజరు కాలేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే