
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) హీరోయిన్ నటించిన సినిమా `గుర్తుందా శీతాకాలం`(Gurthunda Seethakalam), సత్యదేవ్ (Sathyadev) హీరోగా నటించారు. చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. కరోనా, ఇతర పెద్ద సినిమాలుండటంతోపాటు ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులు సైతం డిలే చేస్తూ వస్తున్నాయి. మొత్తానికి తమన్నా సినిమా తెరపైకి రాబోతుంది.
ఎట్టకేలకు `గుర్తుందా శీతాకాలం` విడుదల తేదీని ప్రకటించింది యూనిట్. సెప్టెంబర్ 23న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో టీనేజ్, కాలేజ్ లైఫ్ సంఘటనలుంటాయి. వాటిని ఎవరూ ఈజీగా మర్చిపోలేరు. ఆ మధురమైన సంఘటనలతో రూపొందించిన చిత్రమిదని, ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా ఉంటుందని తెలిపారు. మొత్తానికి తమన్నా సినిమా అనేక అడ్డంకులు, వాయిదాల అనంతరం రిలీజ్‌కి రెడీ అవుతుందని చెప్పొచ్చు.
ఇంందులో సత్యదేవ్, తమన్నాలతోపాటు మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, ప్రయదర్శి ముఖ్య పాత్రలు పోషించారు. ఎంఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించారు. కన్నడలో సక్సెస్ అయిన `లవ్ మాక్ టైల్` చిత్రాన్ని తెలుగులులో `గుర్తుందా శీతాకాలం` పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. తమన్నా ఇటీవల `ఎఫ్3` సినిమాతో అలరించిన విషయంతెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంతో తెలుగు తెరపై మరోసారి సందడి చేయబోతుందని చెప్పొచ్చు.