సమంత ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. `యశోద` నుంచి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌

Published : Aug 30, 2022, 09:10 PM IST
సమంత ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. `యశోద` నుంచి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌

సారాంశం

సమంత అభిమానులకు గుడ్‌ న్యూస్‌ రాబోతుంది. ఆమె నటించిన `యశోద` సినిమా నుంచి క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది యూనిట్‌. 

సమంత ప్రస్తుతం వరుసగా పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో `యశోద` ఒకటి. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. దర్శక ద్వయం హరి-హరీష్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇది వరకే సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. జులై, ఆగస్ట్ లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వర్క్‌ కంప్లీట్‌ కాకపోవడంతో డిలే అవుతూ వస్తోంది. ఆ మధ్య ఓగ్లింప్స్ విడుదల చేశారు. అది సినిమాపై అంచనాలను పెంచింది. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో సడెన్‌గా సర్‌ప్రైజ్‌ రెడీ చేసింది యూనిట్‌. సమంత అభిమానులకు ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. 

వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌ డేట్‌ ఇవ్వబోతుందట. తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. థ్రిల్‌ కోసం రెడీగా ఉండండి అని నిర్మాణ సంస్థ తెలిపింది. రేపు ఎగ్జైటింగ్‌ అప్‌ డేట్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపింది. అయితే వినాయక చవితి సందర్భంగా బుధవారం ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ని ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమా నుంచి మరో వీడియో గానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి సమంత నుంచి అభిమానులకు మంచి గుడ్‌ న్యూస్‌ రాబోతుందని చెప్పొచ్చు. 

సమంత తెలుగులో చివరగా `జాను` చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇటీవల తమిళంలో నటించిన `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. కానీ అది పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంత సినిమా కోసం ఆమె అభిమానులే కాదు సాధారణ ఆడియెన్స్ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?