అమలా పాల్ కి మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు.. అరెస్ట్

Published : Aug 30, 2022, 07:25 PM IST
అమలా పాల్ కి మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు.. అరెస్ట్

సారాంశం

మాజీ ప్రియుడు తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను లీక్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హీరోయిన్‌ అమలా పాల్‌(Amala Paul) లైంగిక వేధింపులకు గురయ్యింది. తన మాజీ ప్రియుడు, ప్రొడక్షన్‌ పార్టనర్‌ భవీందర్‌ సింగ్‌ ఆమెని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అమలాపాల్‌. భభవీందర్‌ తనని వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆమె కేరళలోని విల్లుపురం పోలీసులను ఆశ్రయించింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను లీక్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యాపారంలో వచ్చిన తేడాల కారణంగానే భవిందర్‌ సింగ్‌ ఇలా వేధింపులకు దిగుతున్నట్టు తెలుస్తుంది. 

స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న అమలా పాల్.. ఆ మధ్య దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. అయితే అంతకు ముందే అమలా పాల్‌.. భవీందర్‌ తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేశారు. అతనితో బ్రేకప్‌ తర్వాత కొన్ని రోజులకు విజయ్‌ని పెళ్లి చేసుకుంది అమలా పాల్‌. విజయ్‌తోనూ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. కెరీర్‌పై ఫోకస్‌పెట్టి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తుంది. 2018 నుంచి ఆమె భవీందర్‌తో కలిసి ప్రొడక్షన్‌ స్థాపించి సినిమాలు నిర్మిస్తుంది. కానీ గత కొంత కాలంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. 

దీంతో డైరెక్టర్‌గా ఉన్న అమలాపాల్‌ని తొలగిస్తూ నకిలీ పత్రాలు సృష్టించాడట.దీనిపై నిలదీయగా ఆయన వేధింపులకు, బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తుంది. లైంగిక వేధింపులతోపాటు బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిపింది. ఆయనతోపాటు మరో 11 మంది కూడా అమలా పాల్‌కి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఫోర్జరీ కేసు, వేధింపులకు సంబంధించి సెక్షన్‌ 16తోపాటు మరికొన్ని సెక్షన్లపై కేసు నమోదు చేసి భవీందర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో పదకొండు మంది కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. 

అమలా పాల్ `బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `నాయక్‌`, `ఇద్దరమ్మాయిలతో` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా తెలుగుకి దూరంగా ఉంటుంది. ఆ మధ్య `ఆమె` డబ్బింగ్‌ చిత్రంలో క్రిటిక్స్ ప్రశంసలందుకుంది. అలాగే ఇటీవల `పిట్టకథలు` ఓటీటీ ఫిల్మ్ తో మరోసారి మెరిసింది అమలా పాల్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు