సైరా జోష్: వన్ ట్రైలర్ ...... హిందీ మార్కెట్ ఫసక్!

By Prashanth MFirst Published Sep 19, 2019, 1:17 PM IST
Highlights

 సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది. దక్షిణాది అన్ని భాషలతో సహా హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. విడుదలైన 45 నిముషాల్లోనే లక్ష లైకులను కూడా సాధించింది. ఖైదీ 150 విడుదలైన చాలా గ్యాప్ తరువాత చిరంజీవి నట విశ్వరూపం చూపెట్టేసాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

250 కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహా రెడ్డి. అక్టోబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది. దక్షిణాది అన్ని భాషలతో సహా హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. విడుదలైన 45 నిముషాల్లోనే లక్ష లైకులను కూడా సాధించింది. ఖైదీ 150 విడుదలైన చాలా గ్యాప్ తరువాత చిరంజీవి నట విశ్వరూపం చూపెట్టేసాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా భారీ బజ్ ని క్రియేట్ చేయడంలో సైరా చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. 

ఇదంతా బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా చిత్ర ప్రొమోషన్లను స్టార్ట్ చేయలేదని తెగ ఆందోళన చెందుతున్నారు. విడుదలకు కేవలం 12 రోజుల సమయం మాత్రమే ఉన్నా,ఇంకా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టలేదు. 

వారు ఆలా బాధపడడానికి కారణం కూడా లేకపోలేదు. చిత్రం విడుదలయ్యే అక్టోబర్ 2వ తేదీనాడే, హిందీలో భారీ తారాగణంతో వార్ చిత్రం విడుదలవుతుంది. హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ హీరోల కలియకతో వస్తున్న ఈ చిత్రం పంపిణీ హక్కులను యాష్ రాజ్ ఫిలిమ్స్  తీసుకుంది. వారి చేతుల్లో సహజంగానే  భారీ సంఖ్యలో థియేటర్లు ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాలంటే చిత్ర ప్రమోషన్ ద్వారా భారీ హైప్ ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. 

తెలుగులో చిరంజీవి కాబట్టి సినిమాకు నాచురల్ క్రేజ్ ఉంటుంది. కానీ హిందీలో ఆలా కాదు కదా. అందుకోసమనే ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. 

నిన్నటి ట్రైలర్ దెబ్బకు ఫ్యాన్స్ కలవరం తీరేట్టుగా కనపడుతుంది. ట్రేడ్ అనలిస్టుల ద్వారా అందుతున్న సమాచారం మేరకు కేవలం ట్రైలర్ హైప్ చూసే 1200 థియేటర్లు హిందీలో కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. చిత్రంలో బిగ్ బి అమితాబ్ కూడా భాగమవడంతో ఆయనకూడా ప్రొమోషన్స్ లో పాలుపంచుకోనున్నట్టు సమాచారం. 

అన్నిటికంటే ముఖ్యంగా ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ ఈ చిత్ర ప్రొమోషన్స్ లో చిరంజీవికి తోడుగా ప్రచారం చేయనున్నారు. సెప్టెంబర్ 22 ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ప్రచార కార్యక్రమాలను భారీ ఎత్తులో టీం సైరా ప్లాన్ చేసినట్టు సమాచారం. 

వీటన్నింటిని బట్టి చూస్తుంటే దాదాపుగా 2200 - 2500 స్క్రీన్స్ లో సైరా చిత్రం హిందీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

click me!