సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక మారడానికి కారణమిదే!

Published : Sep 19, 2019, 12:30 PM ISTUpdated : Sep 19, 2019, 12:56 PM IST
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక మారడానికి కారణమిదే!

సారాంశం

మెగాస్టార్ కేరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22న గ్రాండ్ గా నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ కేరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22న గ్రాండ్ గా నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6గంటలకు వేడుక స్టార్ట్ కానుంది. 

ఇక కొత్తగా ఈవెంట్ కి సంబందించిన పాస్ లను కూడా చిత్ర యూనిట్ రెడీ చేసింది. నిజానికి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూలు జిల్లాలో పెట్టాలని భావించారు. అయితే, వర్షం సూచనలు ఉండడంతో హైదరాబాదుకు మార్చుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను చిరంజీవి హైదరాబాదుకు మార్చడం సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఆ అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అక్టోబర్ 2న సినిమా తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కేక్కిన ఈ సినిమాను కొణిదెల   ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?