సైరా ప్రీరిలీజ్: తండ్రి నిర్మాణంలో నటించే కొడుకులు ఉన్నారు కానీ..

Published : Sep 22, 2019, 08:49 PM ISTUpdated : Sep 22, 2019, 08:52 PM IST
సైరా ప్రీరిలీజ్: తండ్రి నిర్మాణంలో నటించే కొడుకులు ఉన్నారు కానీ..

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. 

సైరా ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు సురేందర్ రెడ్డి క్లుప్తంగా తన ప్రసంగాన్ని ముగించారు. చిత్రం కోసం 250 రోజుల పాటు కష్టపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు కృతజ్ఞతలు అని సురేందర్ రెడ్డి తెలిపారు. 

కొరటాల శివ, వివి వినాయక్ చిత్ర యూనిట్ కి, రాంచరణ్, చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి నిర్మాణంలో నటించే కొడుకులు ఉన్నారు. కానీ కొడుకు నిర్మాణంలోనే తండ్రి నటిస్తున్నాడు. ఇది చాలా ముచ్చటగా ఉంది అని కొరటాల అభిప్రాయపడ్డారు. 

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ట్రైలర్ లో కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి గారు అదరగొట్టేశారు. ఒక కొడుకుగా రాంచరణ్ ఒక స్థాయిని సెట్ చేశాడు అని తేజు ప్రశంసించాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ చరణ్ అన్న సైరా చిత్రాన్ని నిర్మించి మీతో పాటు మా దాహాన్ని కూడా తీర్చబోతున్నారు అని తెలిపాడు. 

సైరా ప్రీరిలీజ్: చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చలేను!

సైరా ప్రీరిలీజ్: జాతి కోసం యుద్ధం చేస్తే అది చరిత్ర.. పరుచూరి!

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్: రామ్ లక్ష్మణ్ వచ్చేశారు.. జనసంద్రంలా ఎల్బీ స్టేడియం!

 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?