సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

Published : Oct 17, 2018, 08:47 PM IST
సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కష్టపడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కష్టపడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేసుకుంది. మెగాస్టార్ ఎనర్జీ వల్లే సినిమా షూటింగ్ చాలా తొందరగా పూర్తవుతోందని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. 

ఇక ఫైనల్ గా మెగాస్టార్ ఇండియాలో చాలా రోజుల తరువాత అడుగుపెట్టారు. గత కొన్ని వారాలుగా జార్జియాలోని సైరా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబందించిన అతి కీలకమైన షెడ్యూల్ ఇదే. దాదాపు 50కోట్ల వరకు ఈ వార్ సన్నివేశాల కోసం ఖర్చు చేశారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. ఆ షెడ్యూల్ అయిపోతే సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ లో గ్రాఫిక్స్ పనులకు సమయం ఎక్కువగా తీసుకోనున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సంగీతం అమిత్ త్రివేది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?