దీపావళికి జగపతి ముద్ర.. టార్గెట్ బ్లాక్ మనీ!

Published : Oct 17, 2018, 08:24 PM ISTUpdated : Oct 17, 2018, 08:25 PM IST
దీపావళికి జగపతి ముద్ర.. టార్గెట్ బ్లాక్ మనీ!

సారాంశం

ప్రస్తుతం విలన్ గా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జగపతి బాబు కథానాయకుడిగా కూడా అప్పుడపుడు కనిపిస్తున్నారు. అయితే ఎక్కువగా విలన్ పాత్రల ద్వారానే జగపతికి క్రేజ్ వస్తోంది. 

ప్రస్తుతం విలన్ గా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జగపతి బాబు కథానాయకుడిగా కూడా అప్పుడపుడు కనిపిస్తున్నారు. అయితే ఎక్కువగా విలన్ పాత్రల ద్వారానే జగపతికి క్రేజ్ వస్తోంది. సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా వరకు తగ్గించేశారు. ఇక చాలా రోజుల తరువాత కథానాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. 

బ్లాక్ మని పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో తెరక్కుతోన్న ముద్ర అనే సినిమాలో జగపతి నటిస్తున్నారు. బ్లాక్ మనీపై పోరాటం చేసే వ్యక్తిగా ఈ చిత్రంలో జగపతిబాబు కనిపించనున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో నెగ్గడం కోసం బ్లాక్ మనీని పోగుచేసి వాటిని ఖర్చుపెడుతున్నారు. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకొని సినిమాను నిర్మించినట్లు చిత్ర సమర్పకుడు నట్టి కుమార్ తెలిపారు. 

ఎన్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ముద్ర సినిమాను క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పనులు ఎండింగ్ కు వచ్చేశాయి. వీలైనంత త్వరగా సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి దీపావళికి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు
Thalapathy Vijay and Trisha: విజయ్ దళపతి, త్రిష కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు?అందులో ఎన్ని హిట్స్?