Brahmamudi: రుద్రాణిని అనుమానిస్తున్న అప్పు.. నిజం తెలుసుకొని షాకైన స్వప్న!

Published : Mar 14, 2023, 01:45 PM IST
Brahmamudi: రుద్రాణిని అనుమానిస్తున్న అప్పు.. నిజం తెలుసుకొని షాకైన స్వప్న!

సారాంశం

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అపార్థాలతో మొదలైన వివాహ బంధం కథాంశంగా వస్తుంది ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 14 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో రేఖని  మందలిస్తాడు కళ్యాణ్. తను ఒక కళాకారిణి ఆమె తలుచుకుంటే సంవత్సరం తిరిగేసరికి కోట్లు సంపాదించగలదు అంటాడు. అబద్ధం చెప్పింది వాళ్ళ అమ్మగారు మోసం చేసింది వాళ్ళ అక్క మధ్యలో తనేం చేసింది. తను ఉండడానికి ఆ రూమ్ బాగోదు అంటూ అపర్ణ కి చెప్తాడు కళ్యాణ్.నేనేమీ తనని అక్కడ ఉండమనలేదు అంటుంది అపర్ణ.

స్వప్న వెళ్ళిపోయి ఉండకపోతే ఈ అమ్మాయి జీవితం తన చేతిలోనే ఉండేది అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు స్వప్న దగ్గరికి వస్తాడు రాహుల్. తననే దీక్షగా చూస్తున్న రాహుల్ ని ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది స్వప్న. నిన్ను చూస్తే అనుమానంగా ఉంది నీ మాటలు, మీ ఫ్యామిలీ ఇదంతా నిజమేనా అని అడుగుతాడు రాహుల్. ఒక్కసారిగా షాకైన స్వప్న ఎందుకలా అడుగుతున్నావ్ అని అడుగుతుంది స్వప్న.

అంత గొప్పింటి అమ్మాయి నాకు ఇంత ఈజీగా పడిపోయింది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను అంటాడు రాహుల్. నిజం తెలియలేదు అని సంతోషపడుతుంది స్వప్న. నేనేంటి నువ్వు కూడా నాకులాగా రిచ్చే కదా అంటుంది స్వప్న. నేను కూడా రిచ్ కాదు మనం తెలివైన వాళ్ళని అనుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకున్నాం అనుకుంటాడు రాహుల్.

బ్రేక్ ఫాస్ట్ గా సలాడ్ తింటున్న స్వప్న ఈ సలాడ్ అంత ఫ్రెష్ గా లేదు నేను ఎప్పుడు ఫ్రెష్ వే తింటాను అంటుంది. నీలాంటి వాళ్ళు రాత్రి మిగిలిపోయిన అన్నం తింటారు. నీలాంటి దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి మేపుతున్నందుకు నన్ను నేను అనుకోవాలి అనుకుంటాడు రాహుల్. శాండ్విచ్ తింటున్న స్వప్నని కంగారు పడకు ఎంత తిన్నా తరగని అందం నీది అంటాడు రాహుల్.

ఈ మాటలకే  నేను పడిపోయాను అంటుంది స్వప్న. పడిపోయింది నువ్వు కాదు నేను కానీ గెలిచేది మాత్రం నేనే ఓడిపోయేది నువ్వు అనుకుంటాడు రాహుల్. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను ఈవినింగ్ కలుద్దాం అంటూ బయలుదేరుతాడు రాహుల్. ఈవినింగ్ త్వరగా వచ్చేయ్ రూమ్ లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. ఈవినింగ్ సరదాగా బయటకు వెళ్లి నైట్ ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్ చేసి వద్దాం అంటుంది స్వప్న.

ఇప్పటికే నీ మీద చాలా ఇన్వెస్ట్ చేశాను అనుకుంటాడు రాహుల్. సరే అంటూ బయలుదేరుతున్న రాహుల్ ని హగ్ చేసుకుంటుంది స్వప్న. ఇది చాలా ముదురు అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరుతాడు రాహుల్. మరోవైపు స్టోర్ రూమ్ లో అడుగుపెట్టిన కావ్యతో ఈ రూమ్ అస్సలు బాగోదమ్మ ఎలా ఉంటారు అంటుంది పనిమనిషి. బానే ఉంది నా భవిష్యత్తు లాగా అంటుంది కావ్య. ఈ గదిని శుభ్రం చేయడం చాలా కష్టం అంటే నాకు కష్టపడటం చాలా ఇష్టం  అంటుంది కావ్య.

ఈ గది క్లీన్ చేయడానికి చాట, చీపురు ఇవ్వు అని అంటుంది కావ్య. నేను శుభ్రం చేస్తానమ్మా అని శాంత అంటే నువ్వు ఇంట్లో వాళ్ళకి సేవలు చేయు నన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఇంకా కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు అంటుంది కావ్య. శాంత ఆ వస్తువులు ఇవ్వటంతో గది శుబ్రపరిచే పనిలో ఉంటుంది కావ్య. మరోవైపు దిగులుగా బయట కూర్చున్న తల్లి దగ్గరికి వచ్చి పిచ్చిదాని లాగా బయటికి కూర్చున్నావేంటి అని అడుగుతుంది అప్పు.

కావ్య అక్కని వాళ్ళు వెళ్ళగొట్టేస్తారేమో అని భయంగా ఉంది అందుకే ఇక్కడే కూర్చున్నాను అంటుంది కనకం. వెలగొట్టే వాళ్లే అయితే పెళ్లి చేసుకొని కారులో ఎందుకు తీసుకువెళ్తారు, అలా ఏమీ జరగదు అంటుంది అప్పు. అక్కడ ఏం జరుగుతుందో తెలియటం లేదు ప్రాణం కొట్టుకుపోతుంది అంటుంది కనకం.

అక్క గురించి తెలుసుకోవాలి అంతే కదా రాజ్ వాళ్ళ మేనత్త మనకి సపోర్ట్ గా మాట్లాడింది  కదా, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయమని ఆమె నెంబరు ఇచ్చింది ఆమెకు చేద్దాము అంటుంది అప్పు. మరి ఈ విషయం ఇంతసేపు చెప్పవేమి అంటూ అప్పుని  ఫోన్ చేయమని కంగారుగా చెప్తుంది కనకం. ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్రాణి తో నేను కనకాన్ని మాట్లాడుతున్నాను నా కూతురు ఎలా ఉంది అని అడుగుతుంది కనకం.

ఇక్కడ జరిగింది చెప్తే భయంతో ఇక్కడికి వచ్చినా వచ్చేస్తుంది అనుకుంటూ బావుంది రాజ్ రూములో ఉంది మహారాణి లాగా చూసుకుంటున్నారు తనని  అంటుంది రుద్రాణి. అక్కడ తనని ఎవరు ఏమీ అనలేదు కదా, మా వల్ల జరిగిన తప్పుని క్షమించారా అంటుంది కనకం. ఒక్కపూటలో ఎవరు మర్చిపోలేరు కదా, దానికి కొంచెం టైం పడుతుంది అంటుంది రుద్రాణి.

మా అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి అని కనకం అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు తర్వాత మాట్లాడిస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణి. అక్కని మహారాణి లాగా చూసుకుంటున్నప్పుడు మన మీద మాత్రం కోపం ఎందుకు ఈవిడ చెప్పేది నిజమేనంటావా అని అనుమాన పడుతుంది అప్పు. మరోవైపు స్వప్న ఫోటో చూస్తూ, తను మా ఇంటికి వచ్చినప్పుడు తన కళ్ళల్లో ప్రేమని చూశాను.

ఆస్తి విషయంలో ఆమె అబద్ధం చెప్పిన ఆమె అభిరుచులన్నీ నాకు నచ్చినట్లుగా ఎందుకు ఉన్నాయి అనుకుంటాడు రాజ్. ఈ అందమైన వెనుక ఎంత వికారమైనా మనసు ఉంది అంతా మోసం అనుకుంటూ స్వప్న ఫోటో ని చింపేస్తాడు రాజ్. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ భోజనానికి పిలుస్తుంది. చేయాలనిపించట్లేదు అని రాజ్ అంటే తప్పదు అంటుంది అపర్ణ.

కొన్ని పీడకలలు వచ్చి వెళ్ళిపోతాయి స్వప్న లాగా కొన్ని పీడకలలు తెల్లవారితే నిజమే కూర్చుంటాయి పెళ్లికూతురు లాగా, దేన్నీ భరించలేం అంటూ విసుక్కుంటాడు రాజ్.నువ్ ఇష్టపడ్డావని ముందు వెనుక ఆలోచించకుండా ఆ కుటుంబంతో సంబంధం కలుపుకోవటం నాది తప్పు, దానికి నీ జీవితం బలైపోయింది అని బాధపడుతుంది అపర్ణ.

ఇందులో నీ తప్పేముంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసం చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా డ్రాప్ చేస్తారు అంటాడు రాజ్. వాళ్ల కోసం వీళ్ళ కోసం నువ్వెందుకు భోజనం మానేయడం అంటూ కొడుకుని బ్రతిమాలి భోజనానికి తీసుకువెళ్తుంది అపర్ణ. మరోవైపు రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది స్వప్న ఎంతకీ టైం పాస్ అవ్వటం లేదు అనుకుంటూ పేపర్ తీసి చదువుతుంది. అందులో వచ్చిన న్యూస్ చూసి షాక్ అవుతుంది.

కావ్యని రాజ్ పెళ్లి చేసుకోవడం ఏంటి, అంటే తను నా చెల్లెలు అని తెలిసిపోయిందా వాళ్ళిద్దరికీ అస్సలు పడదు కదా వాళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి పెద్ద వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు పెళ్లి మండపంలో ఏదో గొడవ జరిగి ఉంటుంది. పేపరు ఇందాకటి నుంచి ఇక్కడే ఉంది రాహుల్ కి న్యూస్ చూసాడా అని కంగారు పడుతుంది స్వప్న. మరోవైపు నీటుగా సర్దుకుంటుంది కావ్య.

అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి ఈ గదిని బంగారం లాగా మార్చేసావు అంటూ మెచ్చుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే ఈ ఇంటికి నీకన్నా మంచి కోడలు ఎవరూ ఉండరు అనిపిస్తుంది, ఈ సంగతి మా అక్క తొందరలోనే గుర్తిస్తుంది  అంటుంది ధాన్యలక్ష్మి, తొందర్లోనే మా రాజ్ ని కూడా మార్చుకుంటావేమో అనిపిస్తుంది అంటూ కావ్యని భోజనానికి పిలుస్తుంది ధాన్యలక్ష్మి.

నన్ను కూడా నలుగురితో పాటు భోజనానికి తీసుకువెళ్తారా శాంత తో  ఇక్కడికి పంపిస్తారు అనుకున్నాను అంటుంది కావ్య. అందరితో కలిసి కూర్చుని తినే హక్కు నీకు ఉంది రా అంటుంది ధాన్యలక్ష్మి. నేను వస్తే అక్కడ చాలామంది ఇబ్బంది పడతారు అంటుంది కావ్య. కానీ భోజనం పెట్టొద్దు అని చెప్పే వాళ్ళు ఎవరూ ఉండరు, నేను ఉన్నాను కదా రా అంటూ తీసుకువెళ్తుంది ధాన్యలక్ష్మి.

భోజనాలు దగ్గర కూర్చున్న కళ్యాణ్ వదినని భోజనానికి పిలవలేదా అని అపర్ణని అడుగుతాడు. తనకి భోజనం పెట్టటానికి నీలాంటి సానుభూతిపరులు చాలామంది ఉన్నారు,వాళ్లు వడ్డించి తినిపిస్తారులే అంటుంది అపర్ణ. తరువాయి భాగంలో పెళ్లికూతురు కనిపించడం లేదు అంటూ రాజ్ కి చెప్తుంది రుద్రాణి. ముసుగులో లోపలికి వస్తున్న కావ్యని ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతాడు రాజ్. రేప్పొద్దున్న చెప్తాను అంటూ వెళ్ళిపోతున్న కావ్యని పట్టుకుంటాడు రాజ్. ఆమె కళ్ళు తిరిగి పడిపోవడంతో కంగారు పడిపోతాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా