కండలు పెంచేస్తున్నాడు.. బన్నీకోసమేనా?

Published : Apr 14, 2019, 01:37 PM IST
కండలు పెంచేస్తున్నాడు.. బన్నీకోసమేనా?

సారాంశం

అక్కినేని యువ హీరో సుశాంత్ కెరీర్ మొదలై ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన బాక్స్ ఆఫీస్ అందుకోలేదు. గత ఏడాది చి.ల.సౌ  సినిమాతో పరవాలేధనిపించిన సుశాంత్ నెక్స్ట్ ఎలాగైనా జనాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నాడు. 

మెయిన్ గా ఫిట్ నెస్ లో కొన్ని మార్పులు చేస్తే బెటర్ అని ముందుగా కండలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ కసరత్తులు బన్నీకోసమే అని టాక్ వస్తోంది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరక్కెక్కుతున్న సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. 

అయితే చిత్ర యూనిట్ దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సుశాంత్ కూడా స్పందించకపోవడంతో త్రివిక్రమ్ విషయాన్నిసీక్రేట్ గా ఉంచుతున్నట్లు మరో టాక్ మొదలైంది. ఫైనల్ గా సుశాంత్ బన్నీ సినిమా కోసం సరికొత్తగా కనిపించడానికి కష్టపడుతున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా