ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ .. ద్విపాత్రాభినయం

Published : Apr 14, 2019, 12:57 PM IST
ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ .. ద్విపాత్రాభినయం

సారాంశం

ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ద్విపాత్రాభినయం చేయటానికి అంగీకరించారని సమాచారం. ఇప్పటి దాకా బన్ని ...డ్యూయిల్ రోల్ లో కనపడలేదు. దాంతో ఖచ్చితంగా ప్రాజెక్టు కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఏ డైరక్టర్ సినిమాలో  అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతన్నారంటే..

ద్విపాత్రిభినయం చేయటం ప్రతీ హీరోకీ ఇష్టమే. అయితే స్టార్ గా ఓ స్దాయికి వచ్చేకే ఆ ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూంటారు. ముఖ్యంగా ద్విపాత్రాభినయం చేయటానికి తగ్గ కథ సెట్ కాకపోతే దాని జోలికి వెళ్లపోవటమే బెస్ట్ అని స్టార్స్ నమ్ముతారు. ఎందుకంటే రెండు పాత్రలూ ఒకేలా ఉంటే ఇంక చేయటానికి ఏముంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ద్విపాత్రాభినయం చేయటానికి అంగీకరించారని సమాచారం.

ఇప్పటి దాకా బన్ని ...డ్యూయిల్ రోల్ లో కనపడలేదు. దాంతో ఖచ్చితంగా ప్రాజెక్టు కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఏ డైరక్టర్ సినిమాలో  అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతన్నారంటే..

అల్లు అర్జున్ 21 వ సినిమా  తన పుట్టిన రోజు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.  ఓ మై ఫ్రెండ్, ఎంసిఏ వంటి సినిమాలు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కబోతున్నది.  ఈ సినిమాకు ఐకాన్... కనుబడుటలేదు అనే టాగ్ లైన్ తో కూడిన టైటిల్ ను ప్రకటించారు.  

త్రివిక్రమ్, సుకుమార్ ల సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.  ఈ సినిమాలోనే అల్లు అర్జున్ ... ద్విపాత్రాభినయం చేస్తున్నాయండున్నారు. అప్పట్లో వచ్చిన చిరంజీవి జేబు దొంగ తరహాలో ఈ సినిమా ఉంటుందంటున్నారు.

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..