దానిని కొనలేము, అమ్మలేం: సుశాంత్ మృతిపై వైరలవుతున్న అంకిత ట్వీట్

By Siva KodatiFirst Published Aug 4, 2020, 9:41 PM IST
Highlights

బాలీవుడ్ నటుడు, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటలకే సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఒక ట్వీట్ చేశారు

బాలీవుడ్ నటుడు, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటలకే సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఒక ట్వీట్ చేశారు.

"listeningtomyhigherself" అనే హ్యాష్ ట్యాగ్‌తో చేసిన ట్వీట్‌లో .. ఆమె తన హృదయ ప్రయాణాన్ని అనుసరిస్తుదని, దీనిని కొనటం, అమ్మటం సాధ్యం కాదంటూ మహిళా సాధికారతపై అరా కాంప్‌బెల్ రాసిన ఒక పుస్తకంలోని కోట్‌ను అంకిత తీసుకున్నారు.

Also Read:రియానే మొత్తం చేసింది.. బాంబ్‌ పేల్చిన సుశాంత్‌ అసిస్టెంట్‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్‌లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని కుటుంబసభ్యులతో పాటు అంకిత.. సుశాంత్ మరణంపై లోతైన దర్యాప్తు జరిపించాలని కోరుతూ వస్తున్నారు.

సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునే రకం కాదని.. అతను తనతో ఉన్నప్పుడు తాను సంతోషంగా ఉండటంతో పాటు తనను కూడా సంతోషంగా ఉంచేవాడని అంకిత చెప్పారు. సుశాంత్ ఎంతో బ్యాలన్స్‌గా వ్యవహరిస్తాడని.. తన ఐదేళ్ల లక్ష్యానికి అనుగుణంగా జీవితాన్ని ప్లాన్ చేసుకునేవాడని ఆమె వెల్లడించారు.

తన ఆలోచనలను వ్రాసుకునేవాడని.. ఐదేళ్ల తర్వాత అతను కోరుకున్నది సాధించేవాడని అంకిత చెప్పారు. కాగా తన కుమారుడి ఖాతా నుంచి రియా చక్రవర్తి వివిధ అకౌంట్లకు రూ.15 కోట్లు బదిలీ చేసుకోవడంతో పాటు వేధించిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు.

తన బిడ్డ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కేకే సింగ్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కోరారు. మరోవైపు సుశాంత్ ప్రమాదంలో ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ముంబై పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన చెప్పారు.

మరోవైపు సుశాంత్ కుటుంబం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు బీహార్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌పై సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేస్తున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో విచారణలో భాగంగా ముంబై పోలీసులు ఇప్పటి వరకు 50 మంది వాంగ్మూలం నమోదు చేశారు.

Also Read:సుశాంత్‌ అకౌంట్లో యాభై కోట్లు మాయం.. వాళ్లే కొట్టేశారు?

కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా బీహార్ పోలీసులు గత వారం ముంబై చేరుకుని సమాంతర దర్యాప్తను ప్రారంభించారు. మరోవైపు ఆర్ధిక నేరాలను పరిశీలించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

అయితే బీహార్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాల్సిందిగా రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించడానికి ఒక రోజు ముందు బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేయడం విశేషం.

 

pic.twitter.com/Ps3xCwGe1v

— Ankita lokhande (@anky1912)

 

click me!