Bigg Boss Telugu 5: గ్రాండ్‌ ఫినాలేకి ఊహించని గెస్ట్‌ లు.. టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ స్టార్స్

Published : Dec 13, 2021, 09:44 PM IST
Bigg Boss Telugu 5: గ్రాండ్‌ ఫినాలేకి ఊహించని గెస్ట్‌ లు.. టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ స్టార్స్

సారాంశం

గ్రాండ్‌ ఫినాలేకి గెస్ట్ లెవరనేది మరింత ఆసక్తి క్రియేట్‌ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పలు బిగ్‌స్టార్స్ నేమ్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. లాస్ట్ టైమ్‌ మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఎవరు రాబోతున్నారనే సస్పెన్స్‌ గా మారిన నేపథ్యంలో పలు బిగ్‌స్టార్స్ పేర్లు వైరల్‌ అవుతుండటం విశేషం.

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో(Bigg Boss Telugu 5) సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ వారాంతంతో ఈ సీజన్‌ పూర్తి కానుంది. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, మానస్‌, సిరి ఉన్నారు. టాప్‌ 5లో ఫైనలిస్ట్ లుగా ఉన్నారు. ఆదివారం(14వ వారం) కాజల్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సారి గెలుపెవరిదనేది ఆసక్తి నెలకొంది. సన్నీదే విజయం అంటూ ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి. షణ్ముఖ్‌ పేరు కూడా వినిపిస్తుంది. మరి వీరిలో విన్నర్‌ ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంటే, Bigg Boss Telugu 5 గ్రాండ్‌ ఫినాలేకి గెస్ట్ లెవరనేది మరింత ఆసక్తి క్రియేట్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే తాజాగా పలు బిగ్‌స్టార్స్ నేమ్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. లాస్ట్ టైమ్‌ మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఎవరు రాబోతున్నారనే సస్పెన్స్‌ గా మారిన నేపథ్యంలో పలు బిగ్‌స్టార్స్ పేర్లు వైరల్‌ అవుతుండటం విశేషం. డిసెంబర్‌ 19న జరుగనున్న గ్రాండ్‌ ఫినాలే ఈ సారి నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉండబోతుందట. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) టీమ్‌ సందడి చేయబోతుందని, గెస్ట్ లుగా సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారనే వార్తలొచ్చాయి. కానీ కేవలం రామ్‌చరణ్‌(Ram Charan) ఒక్కరే ఇందులో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని సమాచారం. 

మరోవైపు ఈ సారి బాలీవుడ్‌ స్టార్స్ దిగబోతున్నారని టాక్‌. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనెలు, అలాగే అలియాభట్‌ సైతం ఈ గ్రాండ్‌ ఫినాలేకి ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయట. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ నుంచి రామ్‌చరణ్‌, అలియాభట్‌, `83` సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా గెస్ట్ లుగా రాబోతున్నారని అంటున్నారు. ఈ షోలో తమ సినిమాని ప్రమోట్‌ చేసుకోవాలని కూడా రణ్‌వీర్‌, దీపికా టీమ్‌ భావిస్తుందట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా చేస్తున్న `బిగ్‌బాస్‌ తెలుగు 5` షో ఈ సారి ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మొదట అనేక విమర్శలు వచ్చినా, తర్వాత ఫర్వాలేదనే టాక్‌ వచ్చింది. అయితే ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ల విషయంలోనే విమర్శలు వచ్చాయి. వాళ్ల ప్రవర్తనే మెచ్యూర్డ్ గా లేదనే విమర్శలు వచ్చాయి. పైగా ఒకరిపై ఒకరు శృతి మించి తిట్టుకోవడాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అనేక కొట్లాటలు, టాస్క్ ల్లో ఫైటింగ్‌ల తో ఆద్యంతం షోని రక్తికట్టించిన సందర్బాలు చాలానే ఉన్నాయి. రేటింగ్‌ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో మాత్రం ఈ ఐదో సీజన్‌ సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. 

also read: RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` దేశభక్తి సినిమా కాదా? షాకిచ్చిన రాజమౌళి.. అసలు స్టోరీ చెప్పేశాడుగా..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్