Saakini Daakini : మేం రెడీ అంటున్న శాకిని-డాకిని.. యాక్షన్ ఇరగదీశారట..

Published : Dec 13, 2021, 06:00 PM IST
Saakini Daakini : మేం రెడీ అంటున్న శాకిని-డాకిని.. యాక్షన్ ఇరగదీశారట..

సారాంశం

హీరోయిన్ రెజీన కసాండ్ర బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న శాకిని-డాకిని మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్.   

రెజీన కసాండ్ర,("Regina cassandra" ) నివేద థామస్(Nivetha Thomas) ప్రధానపాత్రలు చేస్తూ... యంగ్ స్టార్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమా శాకిని-డాకిని. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో రిలీజ్  కాబోతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి కూడా అంచనాలు పెరుగుతూ వచ్చాయి.


 ఈరోజు (సోమవారం) హీరోయిన్ "Regina cassandra" పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. నివేధ థామస్ - రెజీన డిఫరెంట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెజీనా, నివేదా థామస్‌ టైటిల్ రోల్స్ పోషిస్తున్నఈ మూవీ లో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.


ఇటు నివేద, అటు రెజీన ఈ ఇద్దరు హీరోయిన్లు ఫామ్ లో లేరు. రెజీనా విమెన్ సెంట్రిక్ మూవీ వైపు వెళ్ళి చాలా కాలం అయ్యింది. కాని ఈమధ్య ఇండస్ట్రీకి వచ్చిన నివేద మాత్రం పెద్ద హీరోలతో సినిమాలు చేసినా.. టాలీవుడ్ లో కెరీర్ ను నిలబెట్టుకోలేక పోయింది. సినిమాల సెలక్షన్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. దాంతో అవకాశాలు తగ్గి..నివేద కూడా విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ వైపు అడుగులు వేస్తోంది. 


అంతే కాదు టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి,  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Also Read : RAVITEJA MASS SONG: ఇద్దరు హీరోయిన్లతో రచ్చ చేస్తున్న రవితేజ..దేవిశ్రీ మాస్ బీట్.

PREV
click me!

Recommended Stories

Naga Chaitanya: నా భర్తను అలా పిలవొద్దు.. శోభిత కి కోపం వచ్చేసిందిగా..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?