
రానా(Rana), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`(Virata Parvam). నక్సల్ నేపథ్యంలో కామ్రేజ్ రవన్నజీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. Virata Parvam సినిమా ఈ ఏడాది సమ్మర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆడియెన్స్ థియేటర్లకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో `విరాటపర్వం` విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. `ది వాయిస్ ఆఫ్ రవన్న` పేరుతో సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. ఈ మేరకు సోమవారం చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. రేపు(మంగళవారం) ఉదయం 10.10గంటలకు ఈ సర్ ప్రైజ్‌ని ప్లాన్ చేసింది. రేపు (డిసెంబర్ 14) హీరో Rana Daggubati పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు దర్శకుడు వేణు ఉడుగుల టీమ్ రెడీ అయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్, `కోలు కోలు..`పాట ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయబోతున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. అయితే ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా `ఓటీటీ`లో విడుదల కాబోతుందనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా దానిపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని, సినిమాని థియేటర్‌లోనే రిలీజ్‌కి ప్లాన్ జరుగుతుందని టాక్.
also read: