16 ఏళ్ల తరువాత సూర్య కల నెరవేరింది!

By Prashanth MFirst Published May 2, 2019, 4:01 PM IST
Highlights

కాలం  పరిగెడుతున్న కొద్దీ వెండితెర లోకంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు దర్శకుల వెంబడి హీరోలు పడేవారు. కానీ ఇప్పుడు హీరోలే దర్శకులను స్పెషల్ గా కలుసుకొని కథలు వింటున్నారు.

కాలం  పరిగెడుతున్న కొద్దీ వెండితెర లోకంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు దర్శకుల వెంబడి హీరోలు పడేవారు. కానీ ఇప్పుడు హీరోలే దర్శకులను స్పెషల్ గా కలుసుకొని కథలు వింటున్నారు. మెయిన్ గా స్టార్ హీరోలు వారికి చిన్న దర్శకులు నచ్చితే పిపిపించి మరి సినిమాలు చేయించుకుంటారు. 

గతంలో సూర్య కూడా అదే తరహాలో సెల్వా రాఘవన్ ని కలిశాడు. రీసెంట్ గా వీరు NGK అనే పొలిటికల్ థ్రిల్లర్ తో ఒకటయ్యారు. అసలైతే 2002లోనే ఈ కాంబో సెట్ అయ్యేది. కానీ 16 ఏళ్లకు కుదిరింది. 7/g బృందావన కాలనీ - ఆడవారి మాటలకూ అర్దాలే వేరులే - యుగానికి ఒక్కడు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సెల్వ మొదట్లో కాదల్ కొండేన్(2002) అనే సినిమాతో ఇండస్ట్రీని ఆకర్షించాడు. 

తెలుగులో 'నేను' టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా ఆ సినిమాను రీమేక్ చేశారు. అయితే కాదల్ కొండెన్ మేకింగ్ కి ఫిదా అయిన సూర్య 2002లో మనమిద్దరం ఒక సినిమా చేద్దామని సెల్వా రాఘవన్ ని అడిగాడు. సూర్యకి తగ్గట్టుగా స్క్రిప్ట్ ను సెల్వా అప్పట్లో రెడీ చేయలేకపోయాడు. ఫైనల్ గా ఇప్పుడు NGKతో కలిశారు. ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమాతో సూర్యా - సెల్వా ఏ స్థాయిలో హిట్టందుకుంటారో చూడాలి. 

click me!