దర్శకనిర్మాతలను సాయి పల్లవి బెదిరిస్తోందా..?

Published : May 02, 2019, 03:39 PM IST
దర్శకనిర్మాతలను సాయి పల్లవి బెదిరిస్తోందా..?

సారాంశం

తమిళ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో 'ఫిదా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. 

తమిళ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో 'ఫిదా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ ఆమెకి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అయితే ఆమెపై తరచూ ఏవొక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 

సాయి పల్లవి యాటిట్యూడ్ చూపిస్తుందని, హీరోలకు విలువ ఇవ్వదని ఇలా ఆమెపై ఏదొక రూమర్ వస్తూనే ఉంది. తాజాగా మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. దర్శకుడు వేణు ఊడుగుల 'విరాటపర్వం' సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తుండగా.. సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఆమె సినిమా నుండి తప్పుకొంటానని దర్శకనిర్మాతలను బెదిరిస్తోందట. నిజానికి ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సివుంది కానీ కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. మరోపక్క సాయి పల్లవి ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది.

అయితే ఈ సినిమాకు ఇచ్చిన డేట్స్ ని వాయిదా వేస్తూ రావడంతో ఇతర ప్రాజెక్ట్ లు వదులుకోలేక త్వరగా డేట్లు కుదుర్చుకోవాల్సిందిగా ఇదివరకు సాయి పల్లవి చిత్రబృందాన్ని కోరిందట. కానీ ఆల్స్యమవుతూ వస్తుండడంతో ఇక చేసేదేమీ లేక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటానని అంటోందట. మరేం జరుగుతుందో చూడాలి. సురేష్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి