రాధిక ఆప్టే తొడపై రాసుకుంది అతని పేరే

Published : May 02, 2019, 03:50 PM IST
రాధిక ఆప్టే తొడపై రాసుకుంది అతని పేరే

సారాంశం

బాలకృష్ణ నటించిన లెజెండ్, లయిన్  చిత్రాలతో తెలుగువాళ్లకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే. నటనలో ఎంత పరిణితి చూపుతుందో ..అంతకు మించి వివాదాల్లో తలదూర్చే ఉత్సాహం చూపుతూంటుంది. 

బాలకృష్ణ నటించిన లెజెండ్, లయిన్  చిత్రాలతో తెలుగువాళ్లకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే. నటనలో ఎంత పరిణితి చూపుతుందో ..అంతకు మించి వివాదాల్లో తలదూర్చే ఉత్సాహం చూపుతూంటుంది. రజనీకాంత్ వంటి నటుల సరసన నటించి ఆల్ ఇండియాలో పేరు తెచ్చుకున్న ఆమె అవసరం అనుకుంటే న్యూడ్ గా నటించటానికి కూడా వెనకాడనంటుంది. తెరపై హాట్ గా కనపడటమే కాదు..తెరవెనక హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలవటం కూడా ఆమెకు బాగా తెలుసు. 

రామ్ గోపాల్ వర్మ  ‘రక్త చరిత్ర’తో పరిచయం అయిన ఈమెకు..ఆయనలాగే వివాదాలంటే ప్రాణం. అంతెందుకు ఆ మధ్యన  కౌస్టింగ్ కౌచ్, మహిళా నటులపై వేధింపులు వంటి విషయాలపై మాట్లాడుతూంటే ఆ మాటల్లో వాడికి,వేడికి ఆశ్చర్యపోతూంటుంది మీడియా సైతం.  ఆ మధ్యన  టాలీవుడ్ లో ఒక స్టార్ తనతో అభ్యంతరకరంగా వ్యవహరించారని రాధిక చేసిన వ్యాఖ్యలు అప్పట్లో షాక్ ఇచ్చాయి. ఈ కామెంట్స్  ఆమె ఎవరిని ఉద్దేశించి  చేసిందా  అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

అవన్నీ ప్రక్కన పెడితే..తాజాగా రాధిక ఒక ఫ్యాషన్‌ షోలో తన అందాలను ఆరబోసింది. ఆ అందాల ఆరబోత సమయంలో ..ఓ విషయం బయిటపడింది.   ఈ అందాల రాశి తొడపై ‘బి’ అనే అక్షరం రాసి ఉండటం అక్కడి కెమెరాలు గమనించాయి.  దీంతో  ఎవరి పేరుని ఇలా రాధిక తన తొడలపై చెక్కుకుందని అంతా ఆలోచనలో పడిపోయారు.  అయితే కొందరు తెలివైన వాళ్లు అబ్బే ‘బి’ అంటే మరెవరో కాదు...  లండన్ లో ఉన్న ఆమె భర్త   బెనెడిక్ట్ టేలర్ పేరులోని మొదటి అక్షరమే.  తన భర్త గుర్తు రావటం కోసం ఇలా  తొడపై రాయించుకుంది  అని తేల్చేసారు. 

ఇక రాధిక..2012లో లండన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఈ భామ భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది.  కెరీర్ పరంగా భర్త లండన్లో  తన బాలీవుడ్ లో అదే ముంబైలో మకాం పెట్టింది. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు