చెన్నై వరదలు.. ఆర్థిక సాయం ప్రకటించిన సూర్య, కార్తి.. సహాయకచర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపు

Published : Dec 05, 2023, 05:44 PM ISTUpdated : Dec 05, 2023, 05:45 PM IST
చెన్నై వరదలు.. ఆర్థిక సాయం ప్రకటించిన సూర్య, కార్తి.. సహాయకచర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపు

సారాంశం

మిచౌంగ్‌ తుఫాను విధ్వంసం కారణంగా చెన్నై నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమవంతు సహాయాన్ని ప్రకటించారు సూర్య, కార్తి. 

మిచౌంగ్‌ తుఫాను విధ్వంసం కారణంగా రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. వరదల్లో సమీప ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చెన్నై సీటీ నీటిలో మునిగిపోయింది. అమీర్‌ ఖాన్, విష్ణు విశాల్‌ వంటి సెలబ్రిటీలు సైతం ఈ వరదల్లో ఇరుక్కున్నారంటే వరదల తాకిడి ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను, నీట మునిగిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునే దాంట్లో భాగంగా సినిమా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమ అభిమానులు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెబుతున్నారు. అంతేకాదు హీరోలు సూర్య, కార్తీలు తమవంతుగా ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. మొట్ట మొదటగా పది లక్షలను వారి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేశారు. అంతేకాదు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని వారు తమ అభిమానులకు పిలుపినిచ్చారు. గతంలోనూ చెన్నై వరదల సమయంలో సూర్య బ్రదర్స్ స్పందించిన తమ వంతు సహాయాలను అందించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే హీరో విశాల్‌.. చెన్నై వరదల పరిస్థితిని చూసి ఆయన మేయర్‌ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మీరైతే హ్యాపీగా సురక్షితంగా ఉన్నారుగా అంటూ సెటైర్లు పేల్చుతూ వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి