చెన్నై వరదల్లో అమీర్ ఖాన్‌, విష్ణు విశాల్‌.. కరెంట్‌ లేదు, సిగ్నల్‌ లేదంటూ వేడుకున్న నటుడు.. ఏం చేశారంటే..

Published : Dec 05, 2023, 04:39 PM IST
చెన్నై వరదల్లో  అమీర్ ఖాన్‌, విష్ణు విశాల్‌.. కరెంట్‌ లేదు, సిగ్నల్‌ లేదంటూ వేడుకున్న నటుడు..  ఏం చేశారంటే..

సారాంశం

చెన్నై వరదల్లో బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌, కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్ చిక్కుకున్నారు. ఇంట్లో కరెంట్‌ లేదు, ఫోన్‌ లో సిగ్నల్‌ లేదు. దీంతో అయోమయ పరిస్థితిలో నటుడు ఏం చేశాడంటే...

చెన్నై వరదల్లో అమీర్‌ ఖాన్‌ చిక్కుకున్నారు. మిచౌంగ్‌ తుఫాన్‌ అటు తమిళనాడు, ఇటు ఏపీ రాష్ట్రాలను అతలా కుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తుఫానుకి సంబంధించిన వరదల్లో సాధారణ ప్రజలు మాత్రమే కాదు, సెలబ్రిటీలు బాధితులుగా మారుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ చెన్నై వరదల్లో ఇరుక్కోవడం కలకలం సృష్టిస్తుంది. ఆయనతోపాటు హీరో విష్ణు విశాల్‌ ఫ్యామిలీ సైతం ఈ వరదల్లో ఇరుక్కున్నారు. విశాల్ భార్య గుత్త జ్వాల, ఇతర ప్రముఖులు ఇంట్లో ఇరుక్కుపోయారు. కరపాకంలోని తమ ఇంట్లోకి వరద నీళ్లు వచ్చి చేరాయి. పవర్‌ లేదు, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. వైఫై లేదు. తమ సమాచారం అందించలేని స్థితి. 

దీంతో ఎట్టకేలకు విష్ణు విశాల్‌ తన మేడ మీదకు ఎక్కి సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి వచ్చి తమ పరిస్థితిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తమతోపాటు చాలా మంది అక్కడ ఇరుక్కున్నారని, తమకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. వెంటనే అధికారులు స్పందించారు. రెస్య్కూ సిబ్బంది విష్ణు విశాల్‌ ఉండే ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే వీరితోపాటు అమీర్‌ ఖాన్‌ ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. 

మరి అమీర్‌ ఖాన్‌ అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది ఆసక్తికరంగా మారింది. అధికారులు తమని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అమీర్‌ ఖాన్‌, తన భార్య గుత్త జ్వాల, ఫ్యామిలీ నీటి పడవలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫోటోలను విష్ణు విశాల్‌ పంచుకుంటూ ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఫైర్‌, అండ్‌ రెస్య్కూ సిబ్బందికి ఆయన ఆయన ధన్యవాదాలు చెబుతూ, కరపాక్కమ్‌లో సహాయక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, మూడు బోట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరీక్షా సమయంలో తమిళనాడు ప్రభుత్వం గొప్పగా వర్క్ చేస్తుందని, అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులకు విష్ణు విశాల్‌ థ్యాంక్స్ చెప్పారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు
Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!