Fighter : ‘ఫైటర్’ నుంచి హృతిక్ రోషన్, దీపికా ఫస్ట్ లుక్ పోస్టర్లు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Published : Dec 05, 2023, 04:19 PM ISTUpdated : Dec 05, 2023, 05:01 PM IST
Fighter : ‘ఫైటర్’ నుంచి హృతిక్ రోషన్, దీపికా ఫస్ట్ లుక్ పోస్టర్లు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

సారాంశం

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’. ప్రస్తుతం ఈ యాక్షన్ ఫిల్మ్ రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ ప్రమోషన్స్ ను షురూ చేశారు. 

‘వార్’, ‘విక్రమ్ వేదా’ వంటి భారీ చిత్రాల తర్వాత బాలీవుడ్ గ్రీక్ గాడ్, యాక్షన్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)  మరో యాక్షన్ ఫిల్మ్ తో రాబోతున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ చిత్రమే ‘ఫైటర్’ (Fighter). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కథానాయిక. ఎప్పటి నుంచో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. తాజాగా రిలీజ్ కు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో హైప్ పెంచేస్తున్నారు. 

నిన్న చిత్రం నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. మూవీలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) పాత్రలో నటిస్తున్నారు. స్క్వాడ్రన్ పైలట్ హోదాలో ఎయిర్ డ్రాగన్స్ యూనిట్ లోని ఈ కీలకమైన పాత్రలో అలరించబోతున్నారు. సంబంధిత యూనిఫాంలో హృతిక్ ఫస్ట్ లుక్ కు ఇప్పటికే  అభిమానులు  ఫిదా అవుతున్నారు. నెట్టింట వైరల్ గా మార్చారు. 

తాజాగా దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ పోస్టర్ నూ పంచుకున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మినల్ రాథోర్ గా అలరించబోతున్నట్టు ప్రకటించారు. దీపికా లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. టైటిల్ కు తగ్గుట్టుగా సిద్ధార్థ్ ఆనంద్ రోల్స్ ను డిజైన్ చేశారని పోస్టర్లను చూస్తే అర్థమవుతోంది. పైలట్ గా ఇద్దరు స్టార్స్ ఎలాంటి అద్భుతాన్ని చేయబోతున్నారనేది చూడాలి. 

ఇక గతేడాది సెప్టెంబర్ 30నే  రావాల్సిన ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఎట్టకేళలకు ఈ చిత్రాన్ని 2024 జనవరి 25న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ కు ఇంకో నెలన్నర సమయమే ఉండటంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఒక్కో అప్డేట్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. చిత్రంలో అనిల్ కపూర్ (Anil Kapoor) , కరణ్ సింగ్, అక్షయ్ ఒబేరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా War2 రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?