Jai Bhim: హాలీవుడ్ రికార్డులకు పాతరేసిన సూర్య 'జై భీమ్'

pratap reddy   | Asianet News
Published : Nov 14, 2021, 04:56 PM IST
Jai Bhim: హాలీవుడ్ రికార్డులకు పాతరేసిన సూర్య 'జై భీమ్'

సారాంశం

హీరో సూర్య లాయర్ పాత్రలో నటించిన 'జై భీమ్' చిత్రం నవంబర్ 2న ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.

హీరో సూర్య లాయర్ పాత్రలో నటించిన 'జై భీమ్' చిత్రం నవంబర్ 2న ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందరి హృదయాలు హత్తుకునే దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గిరిజనులపై జరుగుతున్న అన్యాయాల్ని ఈ చిత్ర రూపంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. 

సూర్య నటన Jai Bhim చిత్రాన్ని మరో స్థాయికి చేర్చింది. సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. పోలీస్ అధికారిగా ప్రకాష్ రాజ్ కూడా మెప్పించారు. జ్ఞానవేల్ టేకింగ్, ప్రతి సన్నివేశంలో ఎమోషన్ అద్భుతమైన అనుభూతి కల్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు నిజంగానే కళ్ళముందు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అంతలా ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తోంది. 

ఇంతటి గొప్ప చిత్రానికి రికార్డులు కూడా దాసోహం అవుతున్నాయి. ఇప్పటి వరకు IMDB రేటింగ్ లో అగ్ర స్థానంలో ఉన్న హాలీవుడ్ చిత్రాలని అధికమించి టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ఆల్ టైం హాలీవుడ్ క్లాసిక్ 'ది షాశాంక్ రిడెంప్షన్' చిత్రం 9.3 రేటింగ్ తో అగ్రస్థానంలో ఉంది. ఆ చిత్రాన్ని అధికమిస్తూ సూర్య జై భీమ్ చిత్రం 9.6 రేటింగ్ తో అగ్ర స్థానానికి చేరుకోవడం విశేషం. సూర్య కెరీర్ లో ఇది తిరుగులేని రికార్డ్ అని చెప్పొచ్చు. 

జై భీమ్, ది షాశాంక్ రిడెంప్షన్ తర్వాతి స్థానంలో ది గాడ్ ఫాదర్, షిండ్లర్స్ లిస్ట్ చిత్రాలు నిలిచాయి. సూర్య గత చిత్రం 'ఆకాశం నీ హద్దరురా' కూడా IMDB లో 9.1 రేటింగ్ సాధించింది. 

జై భీమ్ చిత్రాన్ని 90వ దశకంలో తమిళాడులో జరిగిన వస్తావ సంఘటనల ఆధారంగా రూపొందించారు. జస్టిస్ చంద్రు గిరిజనలు న్యాయం కోసం పోరాడారు. అయన పాత్రలోనే ఈ చిత్రంలో సూర్య నటించారు. 

Also Read: కేథరిన్ కిల్లింగ్ ఫోజులు.. చూపులతోనే గుండెల్ని గుచ్చేస్తున్న లేడి ఎమ్మెల్యే

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్