టెంపర్ లో 'దేవుడా దేవుడా' సాంగ్ నేను పాడాలని అనుకోలేదు. కానీ ఒక బిట్ పాడి ఎన్టీఆర్ కి పంపించా. ఆయనకు చాలా బాగా నచ్చింది.
కింగ్ నాగార్జున త్వరలో బంగార్రాజు చిత్రంతో మరోసారి రొమాంటిక్ అల్లరి చేయబోతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ రీసెంట్ గా మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రంలోని 'లడ్డుండ' అనే సాంగ్ విడుదల చేశారు.
Anup Rubens సంగీతం అందించిన ఆ పాట ఇన్స్టంట్ హిట్ గా మారింది. తాజాగా అనూప్ రూబెన్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలు పంచుకున్నారు. 'లడ్డుండ' అనే ఐడియా దర్శకుడు కళ్యాణ్ కృష్ణదే. ఈ చిత్రంలో Nagarjuna ఊతపదం లడ్డుండ. దానిపై ఓ బిట్ సాంగ్ ప్లాన్ చేస్తే బావుంటుంది అని డైరెక్టర్ అన్నారు. వెంటనే దానిపై వర్క్ చేసి బిట్ సాంగ్ చేశాం. నాగార్జున గారు విని చాలా బావుంది.. కంప్లీట్ సాంగ్ గా మార్చండి అని అన్నారు. అలా ఈ సాంగ్ తయారైంది. నాగార్జున సర్ కూడా వాయిస్ ఇవ్వడంతో ఇన్స్టంట్ హిట్ గా మారిపోయింది అని అనూప్ తెలిపాడు.
అలాగే ఈ ఇంటర్వ్యూలో అనూప్ ఎన్టీఆర్, పూరి జగన్నాధ్, తేజ లాంటి వారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకున్నారు. తన చిత్రాలలో అన్ని పాటలు నేనే పాడాలని ఎప్పుడూ అనుకోను. మంచిపాట దొరికినప్పుడు మంచి సింగర్ పాడితే బావుంటుంది అని ఆలోచిస్తాను. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల నేనే పాడాల్సి వస్తుంది.
టెంపర్ లో 'దేవుడా దేవుడా' సాంగ్ నేను పాడాలని అనుకోలేదు. కానీ ఒక బిట్ పాడి NTR కి పంపించా. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో మిగిలిన సాంగ్ ఎవరితో అయినా పాడించండి. ఈ పాట మాత్రం అనూప్ మాత్రమే పాడాలి అని పూరితో అన్నారట. నేను ఈ సాంగ్ కోసం వేరే సింగర్ పేరు పూరి వద్ద ప్రస్తావించా. ఆయన నాకు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాట నువ్వే పాడాలి అని అన్నారు. అలా కొన్ని పాటలు పాడాల్సి వస్తూ ఉంటుంది అని అనూప్ తెలిపారు. ఇక తేజ గారితో పనిచేయడం చాలా కష్టం అని అంటారు. నాకెప్పుడూ అలా అనిపించలేదు అని అనూప్ అన్నారు.
Also Read: కేథరిన్ కిల్లింగ్ ఫోజులు.. చూపులతోనే గుండెల్ని గుచ్చేస్తున్న లేడి ఎమ్మెల్యే