Shilpa shetty: మరో కేసులో బుక్ అయిన రాజ్ కుంద్రా... ఈసారి శిల్పా శెట్టి కూడా

Published : Nov 14, 2021, 04:35 PM IST
Shilpa shetty: మరో కేసులో బుక్ అయిన రాజ్ కుంద్రా... ఈసారి శిల్పా శెట్టి కూడా

సారాంశం

పోర్నోగ్రఫీ కేసులో రెండు నెలలు జైలు జీవితం గడిపిన రాజ్ కుంద్రా పై మరో కేసు నమోదైనట్లు సమాచారం అందుతుంది. కోట్ల రూపాయల చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టిపై ఓ బిజినెస్ మాన్ ఫిర్యాదు చేశారు.

రాజ్ కుంద్రా (Rajkundra) దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఓ బిజినెస్ డీల్ విషయంలో తనను మోసం చేసినట్లు బిజినెస్ మాన్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల క్రితం ఫిట్నెస్ ఎంట్రప్రైజ్ స్థాపించనున్నట్లు నమ్మబలికిన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పెట్టుబడి రూపంలో రూ. 1.5కోట్లు తీసుకున్నారు. వ్యాపార భాగస్వామిగా లాభాలు వస్తాయి, అని నమ్మబలికారు. కాలం గడుస్తున్నా ఆ ఫిట్నెస్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 


దీనితో సదరు వ్యాపారి తన డబ్బులు కోటిన్నర తిరిగి చెల్లించాలని శిల్పా దంపతులను అడగడం జరిగింది. డబ్బులు తిరిగి చెల్లించకపోగా... తనను బెదిరించారని బిజినెస్ మాన్ తన కంప్లైంట్ లో పొందుపరిచారు. ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్ లో రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 420 చీటింగ్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు అయినట్లు సమాచారం. 


ఇక నీలి చిత్రాల చిత్రీకరణ, యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రా జులై నెలలో అరెస్ట్ కబడ్డారు. దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం సెప్టెంబర్ లో విడుదల కావడం జరిగింది. భర్త అరెస్ట్ తరువాత కొన్నాళ్ళు శిల్పా శెట్టి (Shilpa shetty) మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. టీవీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొట్టిన శిల్పా , తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే చాలా మంది బాలీవుడ్ సెలెబ్స్ ఆమెకు మద్దతుగా నిలిచారు. 

Also read మ్యూజిక్ డైరెక్టర్ కి పూరి జగన్నాధ్ వార్నింగ్.. ఎన్టీఆర్ కోసమే..
విడుదల తరువాత రాజ్ కుంద్రా మొదటిసారి భార్య పిల్లలతో హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయం సందర్శన సమయంలో కనిపించారు. ట్రిప్ అనంతరం శిల్పా శెట్టి మాత్రమే ఒంటరిగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా, రాజ్ కుంద్రా, పిల్లలు కనిపించలేదు. 

Also read Bigg boss telugu 5: లోపల ఉన్న ప్రియుడు షన్నును తిడితే, బయటున్న దీప్తికి మండింది...!
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే