ET Telugu Teaser: తెలుగు ఆడియెన్స్ కి సూర్య గిఫ్ట్.. దుమ్మురేపుతున్న `ఈటీ` తెలుగు టీజర్‌.. ట్రెండింగ్‌

Published : Feb 19, 2022, 07:24 PM IST
ET Telugu Teaser: తెలుగు ఆడియెన్స్ కి సూర్య గిఫ్ట్.. దుమ్మురేపుతున్న `ఈటీ` తెలుగు టీజర్‌.. ట్రెండింగ్‌

సారాంశం

తెలుగు మార్కెట్‌పై మరింతగా ఫోకస్‌ పెట్టారు సూర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `ఈటీ` చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. `ఈటీ` పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. 

కోలీవుడ్‌ హీరో సూర్య(Suriya) తన సినిమాలను వరుసగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దీంతో ఆయనకి తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఓటీటీ సినిమా `జై భీమ్‌` తో విశేషంగా ఆకట్టుకున్నారు. ఓటీటీ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ చిత్రాన్ని తెగ చూసేశారు. బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో తెలుగు మార్కెట్‌పై మరింతగా ఫోకస్‌ పెట్టారు సూర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `ఈటీ`(ET) చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. `ఈటీ` పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం సూర్య స్వతహాగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఇది తెలుగు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్‌ అనే చెప్పాలి. 

మరోవైపు తాజాగా మరో గిఫ్ట్ ఇచ్చారు Suriya. `ఈటీ` తెలుగు టీజర్‌(ET Telugu Teaser)ని విడుదల చేశారు. తమిళ టీజర్‌ శుక్రవారమే విడుదల కాగా, ఒక్క రోజు గ్యాప్‌తో తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ `ఈటీ` టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మాస్‌ లుక్‌లో సూర్య అదరగొడుతున్నారు. తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఇందులో యాక్షన్‌, కామెడీ, పీరియాడికల్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్ ఇలా అనేక అంశాల మేళవింపుగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. 

`నాతో ఉన్నవాళ్లెప్పుడూ భయపడకూడదు. మనల్ని ఎప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు` అని టీజర్‌లో సూర్య చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత సూర్య మరోసారి మాస్‌ గెటప్‌లో అదరగొట్టబోతున్నారు.   'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET) చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఏసియన్‌ సినిమాస్‌ పతాకంపై రిలీజ్‌ కాబోతుంది. మార్చి 10న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయబోతున్నారు. రెండు ఓటీటీ చిత్రాల తర్వాత సూర్య సినిమా థియేటర్‌లో రాబోతుంది. గత రెండు సక్సెస్‌ సాధించాయి. దీంతో `ఈటీ`తో హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ పాట విడుదలైంది. `పొడవకురో గుండెల్లోనా పోట` అంటూ సాగే ఈ పాటను  ఇమాన్ స్వరపరిచగా.. ఈ పాటకి వనమాలి సాహిత్యాన్ని అందించారు. హరిచరణ్,  శ్రీనిధి కలిసి అద్భుతంగా ఈ పాటను  ఆలపించారు. సూర్య, ప్రియాంక మోహన్ పై చిత్రీకరించిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?