Shaakuntalam First Look: సమంత కొత్త సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఫ్యాన్స్ అలెర్ట్

Published : Feb 19, 2022, 06:45 PM IST
Shaakuntalam First Look: సమంత కొత్త సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఫ్యాన్స్ అలెర్ట్

సారాంశం

స్టార్‌ హీరోయిన్‌ సమంత తన అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతుంది. తాను నటించిన కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రం బృందం ప్రకటించింది. 

సమంత(Samantha) తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తాను నటిస్తున్న తెలుగు చిత్రం `శాకుంతలం`(Shaakuntalam)  నుంచి ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఇందులో సమంత శకుంతలగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న సోమవారం ఉదయం 9.30గంటలకు సమంత ఫస్ట్ లుక్‌(Shaakuntalam First Look)ని విడుదల చేయబోతున్నారు. దీంతో సమంత అభిమానులు `శాకుంతలం`లోని శకుంతల ఫస్ట్ లుక్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఇక ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ తనయ అల్లు అర్హ బాలనటిగా వెండితెరకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగింది. దేవ్‌ మోహన్‌ మేల్‌ లీడ్‌గా చేస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గతేడాది పూర్తి చేసుకుంది. గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్‌ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ లో టీమ్‌ బిజీగా ఉంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. 

ఇక సమంత విషయానికి వస్తే ఆమె ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` చిత్రంతో బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ని ఏర్పర్చుకుంది. అంతకు ముందు సౌత్‌లో మెప్పించిన సమంత ఈ వెబ్‌ సిరీస్‌తో అన్నింట క్రేజీ హీరోయిన్‌గా మారింది. దీనికితోడు ప్రస్తుం సమంత సౌత్‌తోపాటు హిందీలో సినిమాలకు కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఓ ఇంటర్నెషనల్‌ ప్రాజెక్ట్ ని కూడా సమంత అనౌన్స్ చేసింది. దీంతో సమంత పాన్‌ ఇండియా హీరోయిన్‌ రేంజ్‌ని దాటేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

సమంత చివరగా ఓటీటీలో `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో కనువిందు చేసింది. ఇందులో రాజీ పాత్రలో మెప్పించింది. అద్భుతమైన యాక్షన్‌ ఎపిసోడ్స్ తో మెస్మరైజ్‌ చేసింది. సినిమా పరంగా `జాను` తర్వాత వెండితెరపై కనిపించలేదు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` పాటలో డాన్సు చేసి ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?