
తెలుగు ఆడియెన్స్ ను వరుస సినిమాలతో అలరిస్తున్న శర్వానంద్ ( Sharwanand) తను నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కానున్నాయి. వాటిలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిబ్రవరి 25 ప్రకటించారు. అయతే ఇదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పవన్ క్రేజ్ ను తట్టుకుని నిలబటం కష్టంగా భావించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ( AMJ) మూవీ మేకర్స్ తమ తాజా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
మార్చి 4న రిలీజ్ చేస్తున్న అప్డేట్ అందించారు. ఈ మూవీలో శర్వానంద్ కు జంటగా ఆల్ ఇండియా క్రష్ ‘రష్మిక మండన్న’నటించింది. కాగా, తిరుమల కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుజిత్ సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మరోవైపు వరుణ్ తేజ్ (Varun Tej)హీరోగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’(Ghani) సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ‘గని’ సినిమా కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇందులో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. కానీ ‘భీమ్లా నాయక్’ మూవీ ఎఫెక్ట్ తో ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా మారనున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ ట్విస్ట్ తో ...కుదిరితే మార్చి 4 లేదంటే మళ్ళీ ఎప్పుడు డేట్ దొరుకుతుందో చెప్పలేని పరిస్దితి ఏర్పడింది. మరో పక్క మే 27న వరుణ్ తేజ్ నటిస్తున్న “ఎఫ్ 3”(F3) విడుదల కానుంది. ఏప్రిల్ లోపు అయినా రావాలి లేదంటే ఆ జూన్ లేదా జులైలో అని ట్రేడ్ అంటోంది. ఇక ఏ తేదీ ఫిక్స్ చేస్తారో చూడాలి.