
ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలతో వరుస హిట్ లను అందుకున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓటిటి లోనే రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేసాడు సూర్య. ఈటి టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. స్త్రీల పట్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే సామాజిక పోరాట యోధుడుగా సూర్య ఇందులో కనిపించాడు. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ చేసారు.
నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య మాస్ డైలాగ్స్, యాక్షన్ తో ఈటీ సినిమా మన ముందుకు వచ్చింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత సూర్య నుండి వచ్చిన సూర్య సినిమా కావడం.. చాలాకాలం తర్వాత ఆరు, దేవా లాంటి మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈటీపై భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు కూడా చాలామందికి తెలియ లేదు.అందుకు కారణాలు రెండు. ఒకటి సినిమా ప్రమోషన్ లేకపోవడం, రెండోది మార్చి 11 న రాధే శ్యామ్ రిలీజ్ ఉండడం. మొత్తానికి ఏదో విధంగా రిలీజైన ఈ సినిమా ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో పాయింట్ బాగానే ఉన్నా పరమ రొటీన్ గా ఫిల్మ్ ఉందని క్రిటిక్స్ పెదవి విరిచారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఈటీ ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది. సన్ నెక్స్ట్ ఇంకా నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఈ చిత్రానికి డిజిటల్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఇక సూర్య నటించిన గత రెండు చిత్రాలు ఓటిటి లో రిలీజ్ అయ్యి విజయం సాధించాయి. అంతకు ముందుకు చిత్రాలు థియేటర్స్ లలో విడుదలైనప్పటి ప్లాప్స్ అయ్యాయి. దీంతో సూర్య మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. సూర్య సినిమా అంటే థియేటర్స్ లలో చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు.
దీంతో ఈటీ సినిమా గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు..అంతే కాకుండా మీడియా, సినీ జనాలంతా రాధే శ్యామ్ మేనియా లో ఉన్నారు. ఈ సినిమా హడావిడిలో ఉండడం తో ఈటీ ని పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. సినిమా రిలీజ్ టైమ్ లోనూ బుక్ మై షో లో టికెట్స్ కనీసం 25 % కూడా బుక్ కాలేదు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య ఎప్పటిలాగే కనిపించాడు. ఇక విలన్ గా నటించిన వినయ్ రాయ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఈటీ ఓటిటీలో చాలా మంది చూసే అవకాసం ఉంది.