Dulquer Salman Movie Bande: యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాపై నిషేదం, అంత తప్పు ఏం చేశాడు...?

Published : Mar 17, 2022, 07:12 AM IST
Dulquer Salman Movie Bande: యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాపై నిషేదం, అంత తప్పు ఏం చేశాడు...?

సారాంశం

మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు సొంత రాష్ట్రం కేరళలోలో షాక్ తగిలింది. ఆయన సినిమాను అక్కడ నిషేదించారు. ఇంతకీ అంత పెద్ద తప్పు దుల్కర్ ఏం చేశాడు. ఎందుకు ఆయన సినిమాను నిషేదించారు. 

మలయాళ యంగ్  స్టార్...  హీరో మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్.. ఇండస్ట్రీ ఎంట్రి ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఓన్ ఇమేజ్ ను సాధించారుడ. తండ్రి పేరుతో స్టార్ అవ్వకుండా.. తనంతట తాను ఓన్ టాలెంట్ తో ఓన్ ఇమేజ్  ను క్రియేట్ చేసుకున్నాడు. 
దుల్కర్ ఒక్క మలయాళం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా  సౌత్ హీరోగా ఎస్టాబ్లీష్ అయ్యాడు. మలయాళంతో పాటు తెలుగు,తమిళ తెరపై కూడా మంచి సినిమాలో .. సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు.

ఇక వరుస హిట్లతో దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్ కు తన సోంత రాష్ట్రాం కేరళలో  థియేటర్ల  యజమానులు  షాకిచ్చారు. ఆయన నటించిన సినిమాలన్నింటిని బాయ్ కాట్ చేయాలని ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయించింది ఇంతకీ నిషేదం విధించాల్సినంత తప్పు యంగ్ హీరో ఏం చేశాడు...? 

దీనికి కారణం ఏమిటంటే.. దుల్కర్ సల్మాన్ తన రీసెంట్ సినిమా సెల్యూట్ ను డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను  సోనీలివ్ లో రిలరీజ్ చేయడానికి ఒప్పందం కూడా కుర్చుకున్నారు మేకర్.  థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని నిర్ణయించడంతో ఆయన సినిమాలన్నింటినీ బాయ్ కాట్ చేయాలని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. 

థియేటర్ ఓనర్లు తీసుకున్న నిర్ణయంపై దుల్కర్ సల్మాన్ ఇంతవరకు స్పందించలేదు. మరి యంగ్ హీరో స్పందన ఎలా ఉంటుందో.. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇంతకు ముంద తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకు కూడా ఇదే ప్రాబ్లమ్ ఎదురయ్యింది. ఆయన సినిమాలు కూడా ఓటీటీకి ఇస్తుండటంతో తమిళనాడు థియేటర్ ఓనస్స్ నుంచి వ్యతిరేకత ఎదురైయ్యింది.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా