Ganesh Acharya Comments: సమంత ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు గణేష్ ఆచార్య ఎంతలా కష్టపడ్డాడో ఆయన మాటల్లోనే..

Published : Mar 16, 2022, 06:50 PM ISTUpdated : Mar 16, 2022, 06:51 PM IST
Ganesh Acharya Comments: సమంత ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు గణేష్ ఆచార్య ఎంతలా కష్టపడ్డాడో ఆయన మాటల్లోనే..

సారాంశం

స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha)నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావా’ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఎంతలా కష్టపడ్డాడో వివరించాడు. ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.  

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప : ది రైజ్’ (Pushpa) మూవీ ఎంత సెన్సేషనల్ అయ్యిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలోని పుష్ప మ్యానరిజం, సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇటు స్పోర్స్ మెన్స్, పొలిటిషన్స్ కూడా పుష్ప మేనరిజానికి ఫిదా అయ్యారు. అయితే  పుష్ప: ది రైజ్ చిత్రం నుండి సమంతా రూత్ ప్రభు నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావా’ దేశంలోని ప్రేక్షకులను ఎంతగానో  ఆకట్టుకుంది. సినిమా సక్సెస్‌తో పాటు డ్యాన్స్‌ కూడా వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం మొదటిసారి సమంతతో కలిసి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్  గణేష్ ఆచార్య (Ganesh Acharya) పనిచేశారు. సినిమా విజయం గురించి మాట్లాడుతూ.. దర్శకుడు సుకుమార్ మరియు నటుడు అల్లు అర్జున్ చాలా సహాయపడ్డారని వెల్లడించారు. ఈ పాటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ గురించి ఆయన  మాట్లాడారు.  

అయితే, పుష్పలో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచిన ‘ఊ అంటావా.. మావా’ సాంగ్ వెనక ఎంతలా కష్టపడ్డాడో తెలిపారు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. ఇందుకు ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో మాట్లాడుతూ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో తాను కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలిపారు. దీంతో సాంగ్ షూటింగ్ చేయడం కూడా కష్టమైందని చెప్పాడు. ఆ సమయంలో తనకు కంటిశుక్లం ఉందని, అయినా  అల్లు అర్జున్ అభ్యర్థన మేరకు ఈ పాటకు కొరియోగ్రఫీ చేశానని చెప్పుకొచ్చాడు. అప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ తనకెంతో సహకరించారని గుర్తు చేశాడు.  ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ పాట కోసం సమంత రూ 5 కోట్లు వసూలు చేసిందని మరియు అల్లు అర్జున్ 'వ్యక్తిగతంగా' ఆమెను ఒప్పించాడనే మేటర్ అప్పట్లో నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. 

 

సమంత ప్రస్తుతం  వరుస సినిమా షెడ్యూల్ లతో బిజీగా ఉంది. ఇటీవల తను చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ఆమె సోషల్ మీడియాలోకి తనకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తెలుగులో ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో కలిసి ‘కత్తువాకుల రెండు కాదల్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా