`కంగువ` నుంచి సూర్య బర్త్ డే ట్రీట్‌.. ఆడియెన్స్ కి `ఆపరేషన్‌ రావణ్‌` సిల్వర్ కాయిన్ గిఫ్ట్..

Published : Jul 23, 2024, 11:40 PM IST
`కంగువ` నుంచి సూర్య బర్త్ డే ట్రీట్‌.. ఆడియెన్స్ కి `ఆపరేషన్‌ రావణ్‌` సిల్వర్ కాయిన్ గిఫ్ట్..

సారాంశం

 నేడు బర్త్ డే జరుపుకుంటున్న సూర్య ఫ్యాన్స్ కి `కంగువ` నుంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అలాగే ఆడియెన్స్ కి సిల్వర్ కాయిన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది `ఆపరేషన్‌ రావణ్‌` టీమ్‌.   

సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కంగువ`. శివ అండ్‌ టీమ్‌ రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది. నేడు హీరో సూర్య పుట్టిన రోజు. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని ఈ చిత్రం నుంచి మొదటి పాటని విడుదల చేశారు. `ఫైర్‌ సాంగ్‌` పేరుతో దీన్ని విడుదల చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్  ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్'ఫైర్ సాంగ్'కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. 'ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ' అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పా `కంగువ` సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండబోతుందట.   

`కంగువ` చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.'కంగువ' సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషర్స్ తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఇండియన్‌ ఆడియెన్స్ కి సరికొత్త ట్రీట్ ని ఇవ్వబోతుందని తెలుస్తుంది. 

ఆడియెన్స్ కి `ఆపరేషన్ రావణ్‌` వెండి కానుకలు..

`పలాస`, `నరకాసుర` వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”.  రాధిక శరత్ కుమార్  కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో రక్షిత్ అట్లూరి సినిమా విశేషాలను పంచుకున్నాడు. 

ఈ సినిమాకి రక్షిత్‌ అట్లూరి నాన్నే దర్శకుడు. ఆయనకిది తొలి మూవీ. ఫస్ట్ మూవీ అయినా, చాలా కష్టపడి, అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడని, అందుకోసం చాలాకష్టపడ్డామని తెలిపారు. `నాన్నగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక, చరణ్ రాజ్ లాంటి వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరినీ సంతృప్తిపరచడం అంత సులువు కాదు. దర్శకుడిగా ప్రతిభ చూపిస్తేనే అది సాధ్యమవుతుంది` అని తెలిపారు. `ఆపరేషన్ రావణ్` సినిమాలో సందేశం ఏమీ ఉండదు. ఈ సినిమాలో సైకో చిన్నప్పటినుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా అవుతాడు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. ఆ సీన్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. నిన్ననే మళ్లీ సినిమా చూశాను. సైకో తన ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ చూస్తూ ఆడియెన్స్ ట్రాన్స్ లోకి వెళ్తార`ని తెలిపాడు.

ఆడియెన్స్ కి సిల్వర్‌ కాయిన్స్ గిఫ్ట్ గురించి చెబుతూ, మా సినిమాను ఎక్కువ మంది ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్ లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ ఇస్తాను. కొందరు చెప్పినట్లు ఊరికే చెప్పడం కాదు. వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాం` అని చెప్పారు రక్షిత్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు