
67 ఏళ్ల చిరంజీవి మోకాలి సమస్యతో బాధపడ్డారని సమాచారం. దీంతో వైద్యులు సర్జరీ సూచించారు. వైద్యుల సలహా మేరకు చిరంజీవి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని తెలుస్తుంది. చిరంజీవి ఆర్థోస్కోపి నీ వాష్ చేయించుకున్నారట. నీ వాష్ ట్రీట్మెంట్ లో మోకాలి చిప్పలో గల ఇన్ఫెక్షన్ తొలగిస్తారట. మోకాలి చిప్పకు రెండు చిన్న రంధ్రాలు చేసి ఫ్లూయిడ్ నింపుతారట. చిరంజీవి ఓ 45 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట.
కోలుకున్నాక చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం కలదు. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇది మలయాళ చిత్రం బ్రో డాడీ రీమేక్. శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్వయంగా నిర్మించనున్నారట.
కాగా చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో చిరంజీవి చిత్రాలతో పోల్చితే భోళా శంకర్ దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంది. రెండో రోజే 70 శాతం వసూళ్లు పడిపోయాయి. సెలవు దినాల్లో కూడా భోళా శంకర్ ని జనాలు చూడలేదు. అంటే ఆన్లైన్ బుకింగ్స్ కూడా లేవు. వీకెండ్ ముగిసే నాటికి భోళా శంకర్ షేర్ కేవలం రూ. 25 కోట్లు. ఇక సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూస్తే విస్తుపోవాల్సిందే... ఏపీ/తెలంగాణల్లో భోళా శంకర్ సోమవారం రూ. 18 లక్షల షేర్ వసూలు చేసింది.
నైజాంలో రూ. 6 లక్షలు. అంటే రెండు మూడు థియేటర్స్ వసూళ్లు రాష్ట్రవ్యాప్తంగా వచ్చాయన్న మాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భోళా శంకర్ ఎంత పెద్ద డిజాస్టరో. టాలీవుడ్ లో దశాబ్ద కాలంలో ఇంత పెద్ద పరాజయం ఏ స్టార్ హీరోకి లేదని టాక్. భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర భారీగా నష్టపోయారు.దర్శకుడు మెహర్ రమేష్ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. భోళా శంకర్ ఇంత పెద్ద డిజాస్టర్ కాగా హిందీలో ఆగస్టు 25న విడుదల చేస్తారట. దీని మీద ట్రోల్స్ పేలుతున్నాయి.