నువ్వు కావాలయ్యా అంటూ.. జాపాన్ యువకుడి అదిరిపోయే డాన్స్, వైరల్ అవుతున్న వీడియో..

Published : Aug 16, 2023, 12:05 PM ISTUpdated : Aug 16, 2023, 12:07 PM IST
నువ్వు కావాలయ్యా అంటూ.. జాపాన్ యువకుడి అదిరిపోయే డాన్స్, వైరల్ అవుతున్న వీడియో..

సారాంశం

ప్రతీ సినిమా సీజన్ కు ఒక పాట పాపులర్ అవ్వడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. రీల్స్.. వీడియోస్ అంటూ హడావిడి కామన్ గా జరిగేదే. అయితే ఈసారి సీజన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి కావాలయ్య సాంగ్ ఆ ప్లేస్ ను ఆక్రమించేసింది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో .. రీల్స్.. షార్ట్ వీడియోస్ లో బాగా పాపులర్ అయిన పాట నువ్వు కావాలయ్య.సూపర్ స్టార్ రజనీకాంత్  న్యూ మూవీ జైలర్ లోని ఈపాట.. ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు.. దేశాన్నే ఊపేస్తోంది.  నిజానికి ప్రతీ సినిమా సీజన్ కు ఒక పాట పాపులర్ అవ్వడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. రీల్స్.. వీడియోస్ అంటూ హడావిడి కామన్ గా జరిగేదే. అయితే ఈసారి సీజన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి కావాలయ్య సాంగ్ ఆ ప్లేస్ ను ఆక్రమించేసింది.
 
అయితే ప్రతీ పాట మన దేశానికే పరిమితం కాకుండా.. విదేశాల్లో కూడా మన ఇండియన్ సాంగ్స్ ముఖ్యంగా సౌత్ ఇండియన్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. అక్కడ సామన్య నెటిజన్లతో పాటు.. ఫారెన్ సెలబ్రిటీలు.. క్రికెటర్లు కూడా మన పాటతో రీల్స్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అవ్వడంతో.. ఇండియన్ సినిమాలకు.. పాటలకు డిమాండ్ బాగాపెరిగిపోయింది. ఇతకు ముందు కూడా పుష్ప లాంటి సినిమాలనుంచి పాపులర్ పాటలక బయటకు వచ్చాయి. ఈసీజన్ లో కూడా కొన్ని పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అందులో ముఖ్యంగా రజినీకాంత్ సినిమా నుంచి రిలీజ్ అయిన నువ్వు కావాలయ్య పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 

 

సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొద్ది కాలంగా ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్నాడు. ఆయన రెమ్యూనరేషన్.. సినిమాల బడ్డెట్ లాభాల మీద.. చాలా మంది రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ వచ్చారు.  రజనీకాంత్ పని అయిపోయింది అన్నారు. కాని వారందరికి జైలర్ అనే ఒక్క సినిమాతో బుద్ది చెప్పాడు సూపర్ స్టార్. 70 ఏళ్ళ వయస్సులో.. సూపర్ స్టార్ చేసిన సినిమా జైలర్ రిలీజ్ అయిన నాలుగైదు రోజులకే.. 400 కోట్లకు పైగా  రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. దేశవిదేశాల్లోని రజనీ అభిమానులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు.

ఇక రజనీకాంత్ కు జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో అదరికి తెలిసిందే. ఈసినిమా ఇంకా జపాన్ లో రిలీజ్ కాకపోయినా.. మూవీని చూడాలి అన్న ఆరాటంలో.. జపాన్ నుంచి ఇండియాకు వచ్చి మరీ చూస్తున్నారు జనాలు. ఈక్రమంలో జైలర్ పాటలు జపాన్ ను కూడా బాగా పాపులర్ అయ్యాయి. అంతే కాదు అక్కడ జనాలు ఈపాటతో రీల్స్ కూడా చేస్తున్నారు.  ఈ సినిమాలోని కావాలయ్యా పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ జపాన్ కుర్రాడు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. కావాలా ఫ్రం జపాన్ క్యాప్షన్ తో కాకెటకు అనే కొరియోగ్రాఫర్ తన ఇన్ స్టాలో ఈ వీడియోను పంచుకున్నాడు.

ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అనుకరిస్తూ కాకెటకు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వారం క్రితం ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు వివిధ సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ డ్యాన్స్ క్లిప్ ను 2 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. వేలల్లో లైకులు, కామెంట్లతో కాకెటకును మెచ్చుకుంటున్నారు

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా