ఫైనల్లీ జాన్వీ కపూర్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ఒర్రి ఎవరో తెలిసిపోయింది?

Published : Aug 16, 2023, 11:50 AM ISTUpdated : Aug 16, 2023, 11:54 AM IST
ఫైనల్లీ జాన్వీ కపూర్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ఒర్రి ఎవరో తెలిసిపోయింది?

సారాంశం

ఎవరు ఒర్రి? సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్. జాన్వీ కపూర్, న్యాసా దేవ్ గణ్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ఒర్రి గురించి పెద్ద చర్చే నడుస్తుండగా, అతని వివరాలు బయటకు వచ్చాయి.   

ఒర్రి అలియాస్ అర్హాన్ అవత్రమణి బాగా పాప్యులర్. బాలీవుడ్ లో జరిగే ఫ్యాషన్ ఈవెంట్స్, హై ఎండ్ పార్టీస్ కి స్పెషల్ అట్రాక్షన్. తరచుగా జాన్వీ కపూర్, న్యాసా దేవ్ గణ్, అనన్య పాండే వంటి స్టార్ కిడ్స్ తో వీకెండ్ పార్టీలు చేసుకుంటాడు. ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తాడు. బడా బడా స్టార్ హీరోయిన్స్ కూడా అతడి పార్టీస్ లో దర్శనమిస్తారు. అసలు ఇంతగా బాలీవుడ్ ని తన చుట్టూ తిప్పుకుంటున్న ఈ ఒర్రి ఎవరంటే సమాధానం లేదు. 

ఇతడు ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. ఏ స్టార్ హీరో, దర్శక నిర్మాత వారసుడు కాదు. బడా పారిశ్రామికవేత్తా అంటే అదీ కాదు. మరి ఎవరు ఒర్రి? అనే చర్చ మొదలైంది. బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. దీంతో ఒర్రి తన వివరాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. మీరందరు ఒర్రి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఒర్రి ఎవరో కాదు ఒర్రినే, నేను ఏం చేస్తానంటే హార్డ్ వర్క్ చేస్తాను... అంటూ ఎలాంటి వివరాలు వెల్లడించకుండా... ఆ వీడియోలో హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీని ప్రమోట్ చేశాడు. గతంలో ఒర్రి, న్యాసా బాగా తాగి పబ్ ముందు కనిపించారు. వారిద్దరూ నడవలేని స్థితిలో కనిపించారు. 

న్యాసా దేవ్ గణ్, జాన్వీ కపూర్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా ప్రచారమైన ఒర్రి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తే... అతడు RIL చైర్ పర్సన్స్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఫైన్ ఆర్ట్స్ కమ్యూనికేషన్ డిజైన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. ఇతడు సోషల్ యాక్టివిస్ట్ కూడాను. ఒర్రి హాలీవుడ్ సెలెబ్స్ కర్దాషియాన్స్, జో జోనాస్, అన్నే హాత్వే,  కైలీ జెన్నర్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో కూడా పరిచయాలు కలిగి ఉన్నాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే