
సూరేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లుదే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత స్టార్ డమ్ సంపాధించిందో.. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా అంతకు మించి ఇమేజ్ ను మూటగట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఆమెతో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా ఇదే బాటలో పయనిస్తుంది.
దాదాపు ఏడాదికి 20 సినిమాలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేసింది సురేఖా వాణి. కాని ఆతరువాత తన భర్త మరణంతో డిఫ్రెషన్ లోకి వెళ్లి.. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. దాంతో ఆమెకు రావల్సిన అవకాశాలన్నీ చేజారాయి. ఇక దాంతో.. ఎక్కువగా సినిమాలు చేయడం కూడా మానేసింది సురేఖ. తన కూతురుతో కలిసి..హాట్ హాట్ ఫోజులిస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్నాళ్లు పద్దతిగా.. చీరకట్టులో.. అక్కగా, వదినగా.. తల్లిగా క్యారెక్టర్ రోల్స్ చేసిన సురేఖలో.. హాట్ కోణం ఇప్పుడు డిప్పుడేు బయటకు వస్తోంది. హీరోయిన్లను మించిన హాట్ నెస్ తో.. ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. కూతురితో కలిసి రెచ్చిపోతోంది బ్యూటీ..
అంతే కాదు పెళ్లీడుకొచ్చిన తన కూతురు సుప్రీతతో కలిసి ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, డాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అందువల్ల ఈమెతో పాటు ఈమె కూతురు సుప్రియకు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. సుప్రీత కూడా ఏమాత్రం మోహమాటపడకుండా అందాలతో విందు చేస్తూ.. నెట్టింట బిజీ బిజీగా గడుపుతోంది. అంతే కాదు తనను కాని.. తన తల్లిని కాని ఎవరైనా విమర్షించినా.. ట్రోల్ చేసినా.. వారికి సోషల్ మీడియాలోనే బుర్ర తిరిగే సమాధానం కూడా చెపుతూ వస్తోంది ఇక ఈక్రమంలోనే ఈ మధ్య ఇంకా బోల్డ్ నెస్ పెంచేసింది సుప్రీత.
ఇదిలా ఉండగా.. తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత ఓ డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ధమాకా సినిమాలో పల్సర్ బైక్ పాటకు.. అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది సుప్రీత. ఆమె చిందులకు సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. ఈ వీడియోతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ వీడియోలో సుప్రీత కాస్త బొద్దుగా కనిపిస్తుంది. అయితే ఆమె అలా ఎందుకు బొద్దగా కనిపించిందతి అనే విషయంలో రకరకాలు కామెంట్లు కనిపించాయి. దాంతో అది ఎందుకు అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసింది.
ఈ విషయంలో సుప్రీత ఇచ్చిన క్లారిటీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపోయా అంటూ ఈమె కామెంట్ పెట్టింది. అయితే డైరెక్ట్ గా ఇన్నర్ వేర్ వేసుకోవడం మర్చిపోయా అన్నట్టుగా సుప్రీత బోల్డ్ కామెంట్స్ చేయడంతో.. ఈ వీడియో ఇంకా వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఇక ముందు ముందు కూడా ఈమె ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అటేు సురేఖ మాత్రం అప్పుడప్పుడు వచ్చిన సినిమా అవకాశాలు ఉపయోగించుకుంటూ..హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.