
సినిమావాళ్ళకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ప్రభావం అటు ఫ్యాన్స్ లో.. ఇటు సామాన్య జనాల్లో బాగా ఉంటుంది. ఇక వాళ్లు కనిపిస్తే ఎగిరి వెళ్ళి టచ్ చేయాలని ఆరాటంతో పాటు.. వాళ్ళు వాడే వస్తువులు, తిండిని కూడా పిచ్చిగా ఫాలో అయ్యే జనాలు చాలా మంది ఉన్నారు. ఇలా ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకోడానికి రకరకాల కంపెనీలు సెలబ్రిటీలకు కోట్లకు కోట్లు ఎర వేసి.. వారి ఉత్పత్తులకు అడ్వటైజ్ చేసుకుంటున్నారు. అయితే మన జనాలు మాత్రం అసలు అది వారు వాడతారా లేదా అనేది కూడా చూసుకోకుండా.. అందులో నిజం ఎంత ఉందో తెలుసుకోకుండా ఎగబడి కొనేస్తుంటారు. ఈక్రమంలో చదువురాని వారు అయితే స్టార్ల మీద పిచ్చితో అలా చేస్తున్నారు అనుకోవచ్చు. కాని చదువుకున్నవారు కూడా ఇలానే వాడుస్తుంటారు.
అంతే కాదు అసలు ఆ సెలబ్రిటీలకు.. ఆ ప్రాడెక్ట్ కు సబంధం లేకుండా ఈ మధ్య అడ్వటైజ్మెంట్స్ ఎక్కువైపోయాయి. స్టార్ హీరోలు మసాలా ఫౌడర్ల, వంటనూనెల గురించి చెపుతుంటే గొప్పగా అనుకుని వాడేస్తున్నారు జనాలు. అసలు అది వాళ్ళు వాడేదేనా అనేది కూడాచ ఆలోచించడం లేదు. ఇది ఇలా ఉంటే.. కొంత మంది వినియోగదారులు మాత్రం.. తాము ఫలానా సెలబ్రిటీ చెప్పినట్టు విని ఫలానా ప్రాడెక్ట్ వాడామని.. అది ప్రాడ్ అని తెలిసిందంటూ.. స్టార్ సెలబ్రిటీల మీద కోర్టుకెక్కుతున్నారు. ఈ మధ్య ఇలాంటికేసులు చాలా పెరిగిపోయాయి. దాంతో వినియోగధారులవైపు తీర్పు ఇస్తూ.. సెలబ్రిటీలకు కోర్టులు షాక్ ఇస్తున్నాయి.
సదరు బ్రాండ్, దాన్ని ప్రచారం చేసిన సెలెబ్రిటీల మీద ఫిర్యాదులు చేసిన వినియోగదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి... అయినా బ్రాండ్ ప్రమోషన్‌లో ఎలాంటి మార్పులు రావటం లేదు. ముఖ్యంగా ఆరోగ్యం, అలంకారానికి సంబంధించిన ఉత్పత్తుల్లో విశ్వసనీయత కొరవడుతోంది. సెలెబ్రిటీలను నమ్మి వస్తువుల్ని వాడిన వారికి అసంతృప్తి మిగులుతోంది. దాంతో చాలా మంది కోర్టులకు ఎక్కుతుంటే.. కొంత మంది మాత్రం ఇంకో సెలబ్రిటీ వాడిన వస్తువు వాడుదాం అంటూ.. వేరే ప్రాడక్స్ట్ కు షిప్ట్ అవుతున్నారు.
దాంతో వినియోగదారుల కష్టాలపై చలించిన కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ ప్రమోషన్‌లపై సెలబ్రిటీలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్‌సూమర్ ఎఫైర్స్ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. సెలెబ్రిటీలు ఏదైనా వస్తు, లేదా సేవలను ప్రమోట్ చేసే ముందు వాటిని తప్పకుండా వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాటి ద్వారా ఎదురైన అనుభవాలను తెలుపుతూ ప్రచారం చేయాలని పేర్కొంది. చేసే ప్రచారం కూడా అందరికీ అర్థమయ్యే సాధారణ భాషలో ఉండాలని అంది. ఫొటో లేదా వీడియోల ద్వారా చేసే ప్రచారం స్పష్టంగా ఉండాలని తెలిపింది. ఓ వస్తువులో లేని గుణాల గురించి చెప్పి ప్రచారం చేయటం నేరమని వెల్లడించింది. దాన్ని తప్పుదోవ పట్టించే ప్రచారంగా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సెలబ్రిటీలకు షాక్ తగిలినట్టు అయ్యింది. చూడాలి మరి ఈ మార్గదర్శకాలను వారు ఎంత వరకూ ఫాలో అవుతారు. జనాలలో ఎంత వరకూ మార్పు వస్తుందో.