
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన మెగా ఈవెంట్ ఖైదీ నెంబర్ 15-0 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే సందిగ్దత నెలకొని ఉంది. ఇటీవల కాలంలో జరిగిన ఏ మెగా ఈవెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అయితే అన్నయ్య దశాబ్ద కాలం తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తుండటంతో ప్రమోషన్ గ్రాండ్ గా నిర్వహించాలనుకుంటున్న మెగా ఫ్యామిలీ... ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఈవెంట్ కు రప్పించాలని ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రామ్ చరణ్ నేరుగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే పవన్ తప్పనిసరిగా ఈవెంట్ కు వస్తాడో లేదో అనుమానమైతే ఉంది. పవన్ రాకపై క్లారిటీ లేకపోవడంతో చిరంజీవి సతీమణి సురేఖ నేరుగా పవన్ ను ఆహ్వానించాలని భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ కు వదినమ్మ ఫోన్ చేశారని తెలుస్తోంది. మరి పవన్ రాకపై క్లారిటీ మాత్రం దొరకట్లేదు. సడెన్ సర్ ప్రైజ్ ఇస్తారో లేక పవన్ డుమ్మా కొడతారో ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా ఆగాల్సిందే.