మార్చి 24న మణిరత్నం డ్యూయెట్

Published : Jan 04, 2017, 01:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మార్చి 24న మణిరత్నం డ్యూయెట్

సారాంశం

కార్తీ, అదితి రావ్ హీరో-హీరోయిన్లుగా మణిరత్నం మూవీ డ్యూయెట్ టైటిల్ తో వస్తున్న మూవీ రిలీజ్ మార్చి 24న  

ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు మణిరత్నం ఓకె బంగారం సినిమా తరువాత కూడా మరోసారి తన మార్క్ రొమాంటిక్ టచ్తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కార్తీ, అదితీరావ్ హైదరీలు హీరో హీరోయిన్లుగా మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు  చిత్రయూనిట్. మణిరత్నం తన సొంతం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్లో స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న మణిరత్నం ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో డ్యూయెట్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

పెళ్లైన మూడు నెలలకే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..?
పెళ్లికి ముందే కోట్లు వదిలించుకున్న రష్మిక మందన్న, ట్యాక్స్ ఎంత కట్టిందో తెలుసా?