రజనీ అభిమానుల సిగ్గుపడే చర్య.. సోషల్‌ మీడియాలో విమర్శలు..

Published : Sep 15, 2021, 07:53 PM IST
రజనీ అభిమానుల సిగ్గుపడే చర్య.. సోషల్‌ మీడియాలో విమర్శలు..

సారాంశం

మాస్‌ లుక్‌లో రజనీ విశ్వరూపం చూపించారు. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ట్రెండింగ్‌గా మారింది. అయితే రజనీ అభిమాని మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇతర అభిమానులు సిగ్గుపడేలా చేశాడు. రజనీ పోస్టర్‌కి అభిషేకం చేశాడు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం `అన్నాత్తే`. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో మాస్‌ లుక్‌లో రజనీ విశ్వరూపం చూపించారు. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ట్రెండింగ్‌గా మారింది. అయితే రజనీ అభిమాని మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇతర అభిమానులు సిగ్గుపడేలా చేశాడు. రజనీ పోస్టర్‌కి అభిషేకం చేశాడు. అది పాలాభిషేకం కాదు. ఏకంగా రక్తాభిషేకం చేశాడు. 

తమిళనాడుకి చెందిన ఓ అభిమాని మేక తల నరికి ఆ రక్తంతో రజనీకాంత్‌ `అన్నాత్తే` ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కి అభిషేకం చేయడం సంచలనంగా మారింది. ఇది తమిళనాట వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అభిమానం కోసం ఓ జంతువు ప్రాణం తీయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతటి దిగ్ర్భాంతికరమైన వీడియో మంగళవారం వైరల్‌ కావడంతో ఇతర ఫ్యాన్స్, నెటిజన్లు స్పందించి ఈ చర్యని ఖండించారు. 

ఇలాంటి చర్యకు పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. దీనిపై ఆల్‌ ఇండియన్‌రజనీకాంత్‌ సరికన్‌ మండ్రం, రజనీ అభిమాని క్లబ్‌ సైతం స్పందించింది. ఈ చర్యని తీవ్రంగా ఖండించింది. మండ్రం నిర్వాహకుడు వీఎం సుధాకర్‌ స్పందించి, ఇది అవమానకరమైన, సిగ్గుచేటైన చర్యగా అభివర్ణించాడు. భవిష్యత్‌లో ఇలాంటి వాటి దూరంగా ఉండాలని ఆయన అభిమానులను కోరారు.

ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, సుదీప్‌ అభిమానులు కూడా పాల్పడ్డారు. పవన్‌ `వకీల్‌సాబ్‌` సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఓ అభిమాని తన చేతిని కట్‌ చేసుకుని ఆ రక్తాన్ని తెరపై చల్లిన విషయం వివాదంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు సుదీప్‌ అభిమానులు `విలన్‌`, `విక్రాంత్‌ రోనా` పోస్టర్ల సమయంలోనూ గేదెని వధించడం వివాదంగా మారింది. ఈ ఘటనలు ఇకనైనా ఆపాలని, అభిమానాన్ని సేవా కార్యక్రమాల్లో చూపించాలని, కానీ ఇలా జంతువద చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇక రజనీ నటించిన `అన్నాత్తే` దీపావళికి విడుదల కాబోతుంది. శివ దర్శకత్వం వహించగా, కీర్తిసురేష్‌, నయనతారా, ఖుష్బు, మీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?